`శాకుంతలం`లో అదితి
on Apr 6, 2021
`యూ టర్న్`తో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ బాట పట్టింది సమంత. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా.. `ఓ బేబి`తో ఫస్ట్ `హీరోయిన్ ఓరియెంటెడ్` హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. కట్ చేస్తే.. ప్రస్తుతం `శాకుంతలం` అనే మరో విమెన్ సెంట్రిక్ మూవీ చేస్తోంది. వెటరన్ డైరెక్టర్ గుణశేఖర్ రూపొందిస్తున్న ఈ మైథలాజికల్ రొమాంటిక్ డ్రామా కోసం.. 150కి పైగా వర్కింగ్ డేస్ కేటాయించింది సామ్.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం చెన్నై పొన్ను అదితి బాలన్ ని ఎంచుకున్నారు. తమిళ చిత్రం `అరువి`తో విమర్శకుల ప్రశంసలు, పలు పురస్కారాలు పొందిన అదితికి.. తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. గత వారం రోజులుగా అదితి.. `శాకుంతలం` చిత్రీకరణలో పాల్గొంటోంది. మరి.. పాన్ - ఇండియా మూవీగా రాబోతున్న `శాకుంతలం`తో అదితికి ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి.
`శాకుంతలం`కి సామ్ కి జోడీగా మాలీవుడ్ యాక్టర్ దేవ్ మోహన్ నటిస్తుండగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ బాణీలు అందిస్తున్నారు. గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న `శాకుంతలం`.. 2022లో థియేటర్స్ లో సందడి చేయనుంది.