"అభినేత్రి" రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది!
on Jul 26, 2016
మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా టైటిల్ పాత్రలో ఏ.ఎల్.విజయ్ తెరకెక్కిస్తున్న చిత్రం "అభినేత్రి". ప్రభుదేవా హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్నారు. తమన్, జీవి ప్రకాష్ సంయుక్తంగా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేద్దామని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
ఆగస్ట్ ఎలాగూ పెద్ద సినిమాలున్నాయి. సెప్టెంబర్ అయితే సబబు అనుకొన్నట్లున్నారు. అందుకే సెప్టెంబర్ 9న "అభినేత్రి" చిత్రాన్ని విడుదల చేద్దామనుకొంటున్నారట. తమన్నా ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తుందని, ఇదో హారర్ సినిమా అని టాక్ వినిపిస్తున్నప్పటికీ.. సినిమా జోనర్ ఏంటనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. బహుశా వచ్చే నెలలో విడుదల చేసే ఆడియో టైమ్ కి సినిమా మీద క్లారిటీ రావచ్చు!