లాక్డౌన్ టైమ్‌లో వచ్చిన 9 పెద్ద మూవీ అనౌన్స్మెంట్స్
on Aug 11, 2020
కరోనా మహమ్మారి దెబ్బకు దాదాపు ఐదు నెలలుగా సినిమా హాళ్లు మూతపడిపోవడంతో సినీ లవర్స్ బాధలు వర్ణనాతీతం. పెద్ద తెరపై తమ అభిమాన హీరోల, దర్శకుల సినిమాలు చూస్తూ, కేరింతలు కొడుతూ, డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేసేవాళ్లకు టీవీలు, ఓటీటీలు, ఏటీటీలు సంతృప్తినివ్వలేక పోతున్నాయి. అయితే వాళ్లను కొంతైనా ఆనందపర్చాలనే ఉద్దేశంతో కొత్త ప్రాజెక్టుల ఎనౌన్స్‌మెంట్లు వస్తున్నాయి.
పరిస్థితులు సాధారణంగా ఉన్నట్లయితే ఈ వేసవిలోనే పలు సినిమాలు థియేటర్లకు వచ్చి అభిమానులను అలరించి ఉండేవి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్', రవితేజ 'క్రాక్', నాని 'వి', రామ్ 'రెడ్', నాగచైతన్య-సాయిపల్లవి 'లవ్ స్టోరి', అఖిల్-పూజా హెగ్డే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', రానా 'అరణ్య', 'విరాటపర్వం', నితిన్ 'రంగ్ దే', శర్వానంద్ 'శ్రీకారం', సాయిధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్', వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ 'ఉప్పెన' వంటివి వచ్చేవి.
హాలీవుడ్‌లోనూ 'టెనెట్', 'నో టైమ్ టు డై', 'వండర్ వుమన్ 1984' వంటి సినిమాలు వాయిదా పడ్డాయి. అయినప్పటికీ కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు ఆగడం లేదు. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలీకపోయినా, పరిస్థితులు ఎప్పటికి నార్మల్ అవుతాయో ఊహకు అందకపోతున్నా దర్శకులు, హీరోలు, నిర్మాతలు కలిసి అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి కొన్ని ఎగ్జయిటింగ్ అనౌన్స్మెంట్స్ ఏవంటే...
1. సర్కారు వారి పాట - మహేశ్, కీర్తి సురేశ్ జంటగా నటించే ఈ మూవీకి పరశురామ్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్నాయి.
2. #ప్రభాస్21 - ప్రభాస్, దీపికా పడుకోనే జంటగా నటించే ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతీ మూవీస్ నిర్మించనున్నది.
3. #ఏఏ21 - అల్లు అర్జున్ హీరోగా నటించనున్న ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నాడు. యువ సుధ ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 కలిసి నిర్మించనున్నాయి.
4. ఫోన్ భూత్ (బాలీవుడ్) - కత్రినా కైఫ్, సిద్ధార్థ్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ నటించే ఈ మూవీకి గుర్మీత్ సింగ్ డైరెక్టర్.
5. నైట్బిచ్ (హాలీవుడ్) - ఆరు సార్లు ఆస్కార్ నామినేషన్ పొందిన అమీ ఆడమ్స్ నటించే ఈ సినిమాకు రాచెల్ యోడర్ నవల నైట్బిచ్ ఆధారం.
6. జాక్ స్నైడర్స్ జస్టిస్ లీగ్ లేదా స్నైడర్ కట్ (హాలీవుడ్) - జాక్ స్నైడర్ డైరెక్ట్ చేసే ఈ మూవీలో బెన్ అఫ్లెక్, హెన్రీ కావిల్, గల్ గదోత్, ఎజ్రా మిల్లర్, జాసన్ మొమోవా, రే ఫిషర్ నటించనున్నారు.
7. ద గ్రే మ్యాన్ (హాలీవుడ్) - రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో ర్యాన్ గోస్లింగ్, క్రిస్ ఇవాన్స్ నటించనున్నారు.
8. ద జంగిల్ ప్రిన్స్ ఆఫ్ ఢిల్లీ (అమెజాన్ సిరీస్) - న్యూయార్క్ టైమ్స్‌లో ఇదే పేరుతో వచ్చిన ఆర్టికల్‌ను డెవలప్ చేసి మీరా నాయర్ డైరెక్ట్ చేయనున్నారు.
9. మాల్కమ్ అండ్ మేరీ (హాలీవుడ్) - జాన్ డేవిడ్ వాషింగ్టన్, జెందాయా టైటిల్ రోల్స్ పోషించే మూవీకి సామ్ లెవిన్సన్ డైరెక్టర్.