ఏడుగురు స్వదేశీ తారలు.. విదేశీ భర్తలు!
on Aug 14, 2020
ప్రేమకు కులమత భేదాలు, ప్రాంతీయ భేదాలు, హోదాల తేడాలు ఉండవు. ప్రేమ ఒక మ్యాజిక్. ఎవరి మీద ఎలా ప్రేమ పుడుతుందో ఎవరూ ఊహించలేరు. ఎక్కడ నుంచైనా, ఎప్పుడైనా ప్రేమగాలి వీచవచ్చు. ఎన్నో సినిమాల్లో ఎందరో సహ నటులతో ప్రేమ సన్నివేశాలు, ముద్దు సన్నివేశాలు, శృంగార సన్నివేశాల్లో నటించే తారలకు నిజ జీవితంలోకి వచ్చేసరికి స్పందనలు ఉంటాయా.. అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. కానీ కెమెరా ముందు చేసేదంతా నటన అనీ, అది నిజం కాదనీ ఆ తారలకు తెలుసు. అందరిలాగే వాళ్లకూ స్పందనలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి.
ఆ కాలపు మహోన్నత తార సావిత్రి నుంచీ, ఈ కాలపు సమంత దాకా ఎంతమంది తారల ప్రేమలను, వాళ్ల పెళ్లిళ్లను మనం చూడలేదు! అయితే కొంతమంది తారలు విదేశీయులతో ప్రేమలో పడి, వాళ్లను జీవిత భాగస్వాములుగా చేసుకోవడం ఇటీవలి కాలంలో మనం గమనిస్తున్న ఓ విషయం. దేశాల హద్దుల్ని చెరిపేసి ప్రేమకు ఏ హద్దూ లేదని వాళ్లు నిరూపిస్తున్నారు. అలాంటి ఏడుగురు భారతీయ తారలు, వాళ్ల విదేశీ భర్తలు...
ప్రియాంకా చోప్రా
భర్త: నిక్ జోనాస్ (అమెరికన్ సెలబ్రిటీ), పెళ్లాడిన సంవత్సరం: 2018
శ్రియా శరణ్
భర్త: ఆండ్రీ కొశ్చేవ్ (రష్యన్ టెన్నిస్ ప్లేయర్), పెళ్లాడిన సంవత్సరం: 2018
ప్రీతి జింటా
భర్త: జీన్ గుడెనఫ్ (అమెరికన్ ఆర్థిక విశ్లేషకుడు), పెళ్లాడిన సంవత్సరం: 2016
రాధికా ఆప్టే
భర్త: బెనెడిక్ట్ టేలర్ (బ్రటీష్ సంగీతకారుడు), పెళ్లాడిన సంవత్సరం: 2012
లీసా రే
భర్త: జాసన్ డెనీ (అమెరికన్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్), పెళ్లాడిన సంవత్సరం: 2012
సన్నీ లియోన్
భర్త: డానియల్ వెబర్ (అమెరికన్ గిటారిస్ట్), పెళ్లాడిన సంవత్సరం: 2011
సెలీనా జైట్లీ
భర్త: పీటర్ హాగ్ (ఆస్ట్రియన్ హోటల్ యజమాని), పెళ్లాడిన సంవత్సరం: 2011