అమెజాన్ ప్రైమ్‌లో ద బెస్ట్ 15 సిరీస్ ఇవే!
on Aug 13, 2020
కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని కుదిపివేయడం మొదలై ఐదు నెలలు గడిచాయి. సోషల్ డిస్టాన్సింగ్ ద్వారా ఈ మహమ్మారిని అడ్డుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించడంతో స్కూళ్లు, కాలేజీలు, మాల్స్ తదితర ఎక్కువమంది తిరుగాడే ప్రదేశాలను మూసేశారు. అనేక వ్యాపార సంస్థలు మూలనపడ్డాయి. ఇంట్లోనే ఎక్కువ సేపు గడపాల్సిన స్థితి అందరిదీ. ఒకప్పుడైతే ఇలా గడపాల్సి రావడం ఒక శిక్షగా ఉండేదేమో. కానీ ఇప్పుడు ఓటీటీ వల్ల ఆ ఇబ్బంది లేదు. మనకు కావాల్సినంత కాలక్షేపాన్ని ఆ ప్లాట్‌ఫామ్ అందిస్తోంది.
ఇంతదాకా నెట్‌ఫ్లిక్స్ ఒక్కటే అమితమైన ఎంటర్టైన్మెంట్ను అందించే స్ట్రీమింగ్ సైట్‌గా చలామణీ అవుతుండగా, ఇప్పుడు దానికి పోటీగా నేనున్నానంటూ అమెజాన్ ప్రైమ్ కూడా మంచి కంటెంట్‌ను, ఎంటర్టైన్మెంట్ను అందిస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్ విషయానికి వస్తే వందల సిరీస్ అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ది బెస్ట్‌ను ఎంచుకోవడం వీక్షకులకు కాస్త కష్టమే. అందుకే ఐఎండీబీ రేటింగ్ పరంగా బెస్ట్ అనదగ్గ 15 సిరీస్ లిస్ట్‌ను అందిస్తున్నాం. ఈ క్వారంటైన్ టైమ్‌లో అవి మీకు మంచి కాలక్షేపాన్ని అందిస్తాయనడంలో సందేహం లేదు.
1. మాల్గుడి డేస్ (హిందీ, కన్నడ) - ఐఎండీబీ రేటింగ్: 9.5
2. ది ఆఫీస్ (ఇంగ్లీష్) - ఐఎండీబీ రేటింగ్: 8.9
3. పంచాయత్ (హిందీ) - ఐఎండీబీ రేటింగ్: 8.8
4. ఫ్లీబ్యాగ్ (ఇంగ్లీష్) - ఐఎండీబీ రేటింగ్: 8.8
5. బందిష్ బ్యాండిట్స్ - ఐఎండీబీ రేటింగ్: 8.7
6. దిస్ ఈజ్ అజ్ (ఇంగ్లీష్) - ఐఎండీబీ రేటింగ్: 8.7
7. ద మార్వలిస్ మిసెస్ మైజెల్ (ఇంగ్లీష్) - ఐఎండీబీ రేటింగ్: 8.7
8. ద హ్యాండ్మైడ్స్ టేల్ (ఇంగ్లీష్) - ఐఎండీబీ రేటింగ్: 8.5
9. సూట్స్ (ఇంగ్లీష్) - ఐఎండీబీ రేటింగ్: 8.5
10. మేడ్ ఇన్ హెవెన్ (హిందీ) - ఐఎండీబీ రేటింగ్: 8.3
11. ద మెంటలిస్ట్ (ఇంగ్లీష్) - ఐఎండీబీ రేటింగ్: 8.1
12. ద బిగ్ బ్యాంగ్ థియరీ (ఇంగ్లీష్) - ఐఎండీబీ రేటింగ్: 8.1
13. గుడ్ ఓమెన్స్ (ఇంగ్లీష్) - ఐఎండీబీ రేటింగ్: 8.1
14. మోడరన్ లవ్ (ఇంగ్లీష్) - ఐఎండీబీ రేటింగ్: 8.1
15. బ్రీత్ ఇన్టు ద షాడోస్ (హిందీ) - ఐఎండీబీ రేటింగ్: 7.7