English | Telugu

ఒక్క పాటకు 13 రోజులు... 1300 డాన్సర్లు!

on Nov 12, 2019

 

'సైరా నరసింహారెడ్డి'లో జాతర పాటను 14 రోజుల పాటు 4500 డాన్సర్లతో షూట్ చేశారు. ఎక్కువమంది డాన్సర్లతో షూట్ చేసిన పాటగా రికార్డ్ క్రియేట్ చేసింది. మరీ అంత ఎక్కువమంది డాన్సర్లతో కాదు గానీ, దాదాపుగా అన్ని రోజుల పాటు 'పానిపట్' కోసం ఒక పాటను షూట్ చేశారు. అర్జున్ కపూర్, కృతి సనన్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో 'మర్డ్ మరాఠా' పాటను 13 రోజుల పాటు, 1300 మంది డాన్సర్లతో షూట్ చేశారు. ముంబైకి హైదరాబాద్, పుణె నుండి డాన్సర్లను తీసుకు వెళ్లారట. పాట కోసం పెద్ద పెద్ద సెట్స్ వేశారట. రాజు ఖాన్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో అర్జున్ కపూర్, కృతి సనన్, పద్మిని కొల్హాపురే తదితరులు పాటలో కనిపించనున్నారు. మూడో పానిపట్టు యుద్ధం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. 


Cinema GalleriesLatest News


Video-Gossips