యాంకర్ ప్రదీప్ హీరోగా ఎంట్రీ!!
on Mar 22, 2019
యాంకర్ గా ప్రదీప్ బుల్లి తెరపై తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఆ మధ్య హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా యాంకర్ ప్రదీప్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసింది. సుకుమార్ వద్ద పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసన మున్నా అనే కొత్త కుర్రాడు ఈ సినిమాకు దర్శకుడు. ఓ నూతన నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందట. 1947 లో జరిగే ఓ వినూతనమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందట. ప్రదీప్ సరసన తమిళ హీరోయిన్ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తుండగా చంద్రబోస్ పాటలన్నింటికీ సాహిత్యాన్ని సమకూరుస్తున్నాడట. కోటిన్నర బడ్జెట్ తో ప్రారంభమైన ఈ సినిమా నాలుగు కోట్ల దాకా ఖర్చైనట్లు తెలుస్తోంది. మరి ప్రదీప్ మీద అంత బడ్జెట్ వర్కవుటవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.