మేరీ `జాన్` గా ప్రభాస్!!
on Oct 13, 2018
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజంట్ జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఇటలీలో గ్రాండ్ గా జరుగుతోంది. పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ నెట్ వర్క్స్ లో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే ఈ సినిమాకు `జాన్ ` టైటిల్ ని ఫిక్స్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో ఈ చిత్రం భారీగా తెరకెక్కుతోంది. సినిమా కథ ప్రకారం, అన్ని భాషలకు యాప్ట్ అయ్యేలా , యూనివర్సిల్ గా ఉండేలా `జాన్ ` టైటిల్ పెట్టడానికి దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ప్రభాస్ నటిస్తోన్న 20వ చిత్రం కావడంతో చాలా గ్రాండ్ గా ఉండేలా దర్శక నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారట. అమిత్ త్రివేది సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ సమకూరస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 16 వరకూ ఇటలీలో ఈ సినిమా షూటింగ్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో ఉండనుందట.
Also Read