మెగాస్టార్ బాటలో మహేష్ బాబు
on Mar 20, 2018
ఎవరి అండదండలు లేకుండా, మంచి సినిమాలు, అందులోనూ ఫాన్స్ మెచ్చే సినిమాలు చేస్తూ మెగాస్టార్ గా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు చిరంజీవి. ఇండస్ట్రీ లో ఎంతో మంది యువ నటులకి ఇన్స్పిరేషన్ మెగాస్టార్. అయితే, మంచి సినిమాలు చేయడమే కాకుండా, ఫాన్స్ తో మెదిలిన పద్ధతి, చిరంజీవి కి అశేష అభిమాన గణం తెచ్చి పెట్టింది. ప్రతి సినిమాకి ముందు, తర్వాత ఫాన్స్ ని కలవడం చిరు కి అలవాటు. సెట్స్ లో కూడా ఏ అభిమాని వచ్చినా ఫొటోలకి టైం ఇచ్చేవాడు. ఇలా చిరు ఒక ట్రెండ్ సెట్ చేయగా, ఆ ట్రెండ్ ని మెగా ఫామిలీ లో ఆ తర్వాత వచ్చిన హీరోలు ఫాలో అయ్యారు. ఇప్పుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా, చిరంజీవి బాటలో నడుస్తున్నాడు.
చిరు అంటే మహేష్ కి, మహేష్ అంటే చిరు కి ప్రత్యేక అభిమానం ఉన్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ మంచి సినిమా చేసిన ప్రతిసారి, చిరు కాల్ చేసి అభినందించడం జరుగుతుంది. అయితే, అభిమానుల్ని పెంచుకోవడం విషయంలో మహేష్ ఇప్పుడు చిరు స్ట్రాటజీస్ తూ.చ. తప్పకుండా పాటిస్తున్నాడు. అభిమానుల్ని తరచూ కలవడం, వాళ్ళతో ఫొటోలకి టైం ఇవ్వడం చేస్తున్నాడట. మహేష్ లో వచ్చిన ఈ మార్పుకి ఫాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారట. బ్రహ్మోత్సవం, స్పైడర్ లు డిజాస్టర్ అవ్వడంతో, మహేష్ తన ఆశలన్నీ ఏప్రిల్ 20 న విడుదలవనున్న భరత్ అనే నేను పైన పెట్టుకున్నాడు.