అఖిల్ సినిమా ఫస్ట్ లుక్ లీకైంది!
on Aug 19, 2017
సినిమా ఫస్ట్ లుక్ లీకవ్వడం... సినిమా ట్రైలర్ లీకవ్వడం.. సినిమాలోని సన్నివేశాలు లీకవ్వడం... మరీ మాట్లాడితే... ఏకంగా సినిమా ఫస్ట్ హాఫ్ లీకవ్వడం... ఈ పరిణామాలన్నీ గత కొన్నేళ్లుగా సినిమా రంగంలో జరుగుతున్నవే. అసలు ఇలాంటి పనులు చేయడం ఎవరికి సాథ్యం? కేవలం యూనిట్ సభ్యులకే సాథ్యం. సినిమాకు హైప్ తేవడానికి చిత్ర దర్శక, నిర్మాతలే ఇలాంటి తలతిక్క పనులు చేస్తున్నారనే వాదన కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే... ఇప్పుడు మరో సినిమా ఫస్ట్ లుక్ లీకైంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ స్టిల్లే. యూనిట్ సభ్యలనడిగితే... ‘మాకు తెలీదు..చూసి మేమే షాక్ అయ్యాం’ అని చెబుతున్నారు.
మరి ఈ పనిచేసిన ప్రబుధ్దుడు ఎవరో ఆ దేవునికే తెలియాలి. ఏది ఏమైనా స్టిల్ మాత్రం అదిరిందని టాక్. ఈ లీక్ వ్యవహారంపై నాగార్జున తన ట్విట్టర్ లో స్పందించాడు. ‘లీకైతే నష్టమేం లేదు. ఈ నెల 21న అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇవ్వనున్నాం’అని స్టేట్మెంట్ ఇచ్చేశాడు. అఖిల్ అయితే... పనిలో పనిగా విక్రమ్ కుమార్ తో తన వర్కింగ్ స్టిల్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసేశాడు. అన్నపూర్ణా స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు ‘జున్ను’అనే టైటిల్ అనుకుంటున్నట్లు గతంలో వార్తలొచ్చాయ్. అయితే... రీసెంట్ గా ‘రంగులరాట్నం’అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు. మరి ఈ టైటిల్ ఈ సినిమా కోసమా? లేక ఇదే సంస్థలో తీయబోతున్న మరో సినిమా కోసమా? అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ నెల 21న అక్కినేని కుటుంబం అభిమానులకు ఇవ్వనున్న ఆ సర్ ప్రైజ్ ఏంటో.. ఎలా ఉండబోతోందో తెలియాలంటే.. ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
Also Read