స్ఫూర్తిని నింపే క్రీడాకారులు...రాబోతున్నారు
on May 22, 2017
ఈ మధ్య అటు బాలీవుడ్ లోనూ ..టాలీవుడ్ లోనూ బయోపిక్ ల సందడి ఊపందుకుంది.ముఖ్యంగా క్రీడాకారుల జీవితాలపై కొత్త చిత్రాలు వరసపట్టనున్నాయి.దర్శకులు అందరు జీవిత కథలపై దృష్టి పెట్టినట్టున్నారు.అందుకే ఆ హవా కొనసాగుతుంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితం పై ' ‘సచిన్-ఎ బిలియన్ డ్రీమ్స్’ మన ముందుకు రాబోతుంది.ఈ చిత్రం ద్వారా సచిన్ జీవితం లోని గొప్ప విషయాలు స్ఫూర్తిని నింపనున్నాయట..అందుకే ఈచిత్రాన్ని చాలా భాషలలో విడుదల చేస్తున్నారు.ఈ చిత్రానికి జేమ్స్ ఎరిక్సన్ తెరకెక్కించారు. తాజాగా బ్యాడ్మింటన్ ప్రపంచ నెంబర్ వన్ గా ఉన్న సైనా నెహ్వాల్ జీవితం పై సినిమా రానున్నది.సైనా నెహ్వాల్ పాత్రను హీరోయిన్ శ్రద్దా కపూర్ నటించనున్నారు.ఈ సినిమాను అమోల్ గుప్త తెరకెక్కించనున్నారు.
ఈ చిత్రానికి 'సైనా 'అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ద్వారా సైనా తన ఎదుగుదలకు ఏ విధంగా ప్రణాళికలను వేసుకుందో చూపించనున్నారట.. అంతేకాదు మరో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి.సింధుపై బయోపిక్ రానున్నది.ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు సోనూసూద్ నిర్మిస్తున్నారు.సింధుగా ఎవరునటిస్తున్నారన్న విషయం ఇంకా తెలియలేదు.కానీ ఈచిత్రం లో సింధు అతిధి పాత్రలో మెరవనున్నది.ఈ చిత్రం ద్వారా సింధు ఎలా కష్టపడిందో ..విజయాలను ఎలా పొందిందో తెలియనుంది.మరి ఈ విబిన్నమై క్రీడాకారులు స్ఫూర్తిని నింపడం ఖాయమని తెలుస్తుంది.