ENGLISH | TELUGU  

పదహారేళ్ళ బంధం....పలచబడని అందం

on May 21, 2017

చూపులను మరల్చని అందాలు..చుక్కలతో పోటీపడే సోయగాలు..చందమామ అసూయ పడే చక్కని ఆ హొయలు ..అవన్నీ కలగలిపిన ముద్దుగుమ్మ  ఐశ్వర్యారాయ్..వయసు పైబడినా కేన్స్ లో తన అందాల ఆరబోతను ఆవిరి కానివ్వక విశేషమైన ప్రతిభను చూపించింది.ఆ బంధానికి పదహారేళ్లు నిండాయి. ఆమె గడిచిన పదహారేళ్ళ లో ప్రతి ఏడాది పరవశింపజేసే నడక తో ఆకట్టుకుంది. తాజాగా జరిగిన కేన్స్ సంబరాలలో మన ఐష్ ఎర్ర తివాచి పై అందాలు చిన్నబోయేలా తన పదహారవ ప్రదర్శనను ..పదహారేళ్ళ పడుచుగా హొయలొలికించింది. ఆమె ప్రతి ఏడాది విభిన్నమైన దుస్తులను ధరించి ..ఆకర్షణీయమైన తీరుతో విభిన్నతను కలిగి హాజరవుతుంటుంది.

ఈసారి కూడా పౌడర్‌ బ్లూ కలర్‌ గౌను వేసుకొని దర్శనమిచ్చింది.ఇది చూసిన నెటిజన్లు ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు.ఈ అందాలు ఈ అవనికే తలమానికమని పొగిడేస్తున్నారు.ఇంతటి ప్రాచుర్యం భారతీయ చిత్రసీమ లో ఎవరికి దక్కలేదని తెలుస్తుంది.ఆమె అందాలకు అభిషేక్ బచ్చన్ మురిసిపోయాడు.అందాల తార ఐశ్వర్యారాయ్ పాల్గొన్న ఈ కేన్స్ ఉత్సవానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యామాలలో అందాల ఆకర్షణల అలజడిని సృష్టిస్తున్నాయి.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.