పవన్ - త్రివిక్రమ్ సినిమా ... కథ లీకయ్యింది
on May 20, 2017
త్రివిక్రమ్ స్వయంగా కధకుడు. రైటర్ గా కెరీర్ ప్రారంభించి టాప్ దర్శకుడిగా ఎదిగారు. కధ చెప్పడంలో ఆయనిది ప్రత్యేక శైలి. ఆయన కధలో లేనిపోని హడావిడి వుండదు. లైన్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అయితే దాన్ని చెప్పే విధానం ఆకట్టుకుటుంది. ఉదాహరణకు అత్తారింటికి దారేది సినిమా తీసుకోండి.. ‘’తండ్రిపై కోపంతో ఇల్లు వదిలివెళ్లిపోతుంది కూతురు. ఆ కూతుర్ని ఎలాగైనా తిరిగి తీసుకువస్తానని తాతకు మాటిస్తాడు మనవుడు. మాటిచ్చినట్లే తీసుకొస్తాడు'' సింపుల్ గా ఇదే అత్తారింటికి దారేది లైను. అయితే ఈ లైనుకు ఆయన ఇచ్చిన ట్రీట్ మెంట్ భలే వర్క్ అవుట్ అయ్యింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా కోసం కూడా త్రివిక్రమ్ ఇంతే సింపుల్ లైన్ ను రాసుకున్నారని వినికిడి. ఇది రివెంజ్ స్టొరీ అట. తన తండ్రి మరణానికి కారణమైన వారిపై పగ తీర్చుకోవాలనే ఓ కొడుకు కధ. లైన్ మాత్రం ఇదే అయినా ఇందులో చాలా వైవిధ్యమైన అంశాలు వుంటాయట. ఇందులో కధానాయుకుడి తండ్రికి ఇద్దరు భార్యలు. రెండో భార్య కొడుకు పవన్ కళ్యాణ్. అయితే పగ మాత్రం మొదటి భార్యదట. ఇదే కాదు .. కధలో ఇంకా చాలా డిఫరెంట్ షేడ్స్ వుంటాయని భోగట్టా. రివెంజ్ డ్రామాలో చాలా సీరియస్ గా నడుస్తుంటాయి. కాని పవన్ కధలో మాత్రం కావల్సినంత ఎంటర్ ట్రైన్ మెంట్ ను మిక్స్ చేశాడట త్రివిక్రమ్. అలాగే ఈ సినిమాలో లవ్ ట్రాక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉటుందని టాక్. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.