సూర్య కోసం సావిత్రి జీవితాన్ని మార్చేస్తారా!
on Mar 30, 2017
అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి అనే సినిమా తీస్తున్న విషయం మనందరికీ విదితమే. కీర్తి సురేష్ మహానటి పాత్ర పోషిస్తుండగా, సమంత ని ఒక ముఖ్యమైన పాత్రకి తీసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్ర ఎవరు పోషించనున్నారు అనే విషయంలో రక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ హీరో సూర్యని ఈ పాత్ర కోసం అడిగారని తెలుస్తుంది. జెమినీ గణేశన్ జీవితం వివాదాల మయం. అందుకని, సూర్య కొన్ని మార్పులు చేర్పులు అడిగాడట. అయితే, దీనికి నాగ్ అశ్విన్ ఏం చెప్పాడనేది తెలియదు, కానీ ఒప్పుకుంటే మాత్రం తాను ఎంతో ఇష్టంతో రాసుకున్న కథ మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. వాస్తవాలు పక్కకు పెట్టేసి, సావిత్రి జీవిత గాద ని కల్పిత గాధగా మార్చాల్సి వస్తుంది. చూద్దాం, అశ్విన్ సూర్య కోసం కథ మారుస్తాడా, లేక తాను అమితంగా ప్రేమించి రాసుకున్న కథకే ఓటేసి ఇంకో నాయకుడి కోసం చూస్తాడో!