గురు పై మొదటి రివ్యూ వచ్చేసింది
on Mar 28, 2017
వెంకటేష్ గురు ఈ నెల 31 కి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవనుంది. మొదట వచ్చే నెల మొదటి వారంలో రిలీజ్ చేద్దామనుకున్న, కొన్ని కారణాల దృష్ట్యా ముందుకు జరిపారు. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ లో హిట్ అయిన సాలా ఖడూస్ కి రీమేక్. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వెంకటేష్, ఇతర ప్రొడక్షన్ టీం గురు ని ప్రమోట్ చేస్తున్నారు. ఓ పక్కన, విడుదలకి కూడా భారీ ఎత్తున సన్నద్ధాలు జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే, గురు సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది. ఇండస్ట్రీ లో కొందరికి గురు సినిమా స్పెషల్ షో వేయడం జరిగింది. చూసిన వాళ్లలో దర్శక-నిర్మాత మధుర శ్రీధర్ ఒకరు. "గురు మూవీ చూసాను. చాలా బాగుంది. సుధా కొంగర అద్భుతంగా తీసారు. వెంకటేష్, రితిక సింగ్ తమ నటనతో అబ్బురపరిచారు. ఈ వేసవి లో ఫామిలీ ఆడియన్స్ కి గురు సరైన సినిమా," అని చెప్పారు. గురు చూసిన ఇతర ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. చూద్దాం తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో!