బయట మ్యూజిక్... లోపల డేటింగ్లో శృతిహాసన్
on Feb 27, 2017
అవునా.. ఇది నిజమా అని అనుకుంటున్నారా..... నిజమే లండన్‌కు చెందిన ఓ యంగ్ మ్యుజిషియన్ తో శృతి డేటింగ్ చేస్తోందట అని అంటున్నారు సినిమా వర్గాలు... అసలు విషయం ఏమిటింటే.. ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటిస్తున్న ‘కాటమరాయుడు’చిత్రంలో హీరోయిన్ శృతిహాసన్ నటిస్తున్న విషయం మీకు తెలిసిందే. మూవీ షెడ్యూల్ పొల్లాచ్చిలో ఫినిష్ కాగానే లండన్‌లో వాలిపోయింది శృతి. అంతే కాకుండా తన బ్యాయ్ఫ్రెండ్తో కలిసి లండన్ మొత్తం షికార్లు చేసిందట. అన్నట్లు వీరిద్దరి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది.
వాలంటైన్స్ డే సందర్భంగా శృతితో గడిపేందుకు అతను లండన్ నుండి ముంబై వచ్చాడని సమాచారం. కొన్ని రోజులుగా ఇద్దరూ కలిసి ఒకే అపార్టుమెంటులో ఉంటున్నారని ముంబైలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ వార్తలను శృతి ఖండిస్తూ... నేను ఓ కొత్త మ్యూజిక్ ఆల్బం కోసమే తరచుగా లండన్ వెళ్తున్నానే తప్ప నాకు ఎలాంటి బాయ్‌ఫ్రెండ్ లేడు అంటూ కాస్త తడబడుతూ మాట్లాడింది. ఈ వార్తలు విన్న సినీ ప్రేక్షకులు మాత్రం మొత్తానికి శృతిహాసన్ ఓ వైపు సినిమాలు తీస్తూ మరోవైపు డేటింగ్ కూడా చాలా సీక్రెట్ గా మెయింటేన్ చేస్తుందని అంటున్నారు.