దువ్వాడలో అల్లు అర్జున్ పంతులు గెటప్ 'అదుర్స్'
on Feb 17, 2017
అదుర్స్ లో ఎన్టీఆర్ చేసిన చారి క్యారెక్టర్ గుర్తుంది కదా. తన అభినయంతో ఎన్టీఆర్ ప్రేక్షకులకి కడుపుబ్బా నవ్వించాడు ఎన్టీఆర్. ఎప్పడికి గుర్తుండిపోయే పాత్ర చేశానన్న తృప్తి ఎన్టీఆర్ కి ఖచ్చితంగా ఉంటుంది, అంత గొప్పదనం ఉన్న క్యారెక్టర్ అది. అసలు విషయానికి వస్తే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అచ్ఛం అలంటి పాత్రే చేస్తున్నాడు దువ్వాడ జగన్నాధం సినిమాలో. నిన్న విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ లో కూడా రుద్రాక్ష మాల విభూతి బొట్లు చూస్తే ఈ వార్త నిజమేమో అన్న సందేహాలకు బలం ఇచ్చింది.
ఇప్పుడు అల్లు అర్జున్ లీక్డ్ ఫోటో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. బ్రాహ్మణుడి గెటప్ లో బన్నీ అదిరిపోయాడు. ఎప్పుడు నూతనంగా ఆలోచించే, ట్రెండీ దుస్తులు ధరించే బన్నీ, కొత్తగా సరికొత్త వేషధారణలో పంతులుగా అభిమానులకి షాక్ ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నాడు. బన్నీ గెటప్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే వరకు సీక్రెట్ గా ఉంచుదామనుకున్నా, ఒక రోజు ముందుగా రావడం ఫిలిం యూనిట్ కి ఒకింత బాధే అయినప్పటికీ, ఈ లీక్డ్ పోస్టర్ కి వస్తున్న ఆదరణ వాళ్ళకి ఖచ్చితంగా కిక్ ఇస్తుంది. లీక్డ్ పోస్టర్ యే ఇలా ఉంటే, ఒరిజినల్ పోస్టర్ లో బన్నీ ఇరగదీసుంటాడు. కానీ ఆ పోస్టర్ కోసం రేపటి వరకు వేచి చూడాల్సిందే!