బండ్లా.... అంత సీన్ ఉందా??
on Jan 19, 2017
చాలా కాలం తరవాత బండ్ల గణేష్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు. బండ్ల ఈజ్ బ్యాక్ విత్ బాస్ అంటూ పవన్ కల్యాణ్‌తో తీయించుకొన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక అక్కడ్నుంచి బండ్లపై కబుర్లే కబుర్లు. పవన్ కల్యాణ్‌తో బండ్ల ఓ సినిమా తీస్తాడని గాసిప్పులు ఊపందుకొన్నాయి. అంతే కాదు... టెంపర్ సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేయనున్నారని, దానికీ బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బండ్ల కు అంత సీన్ ఉందా?? బండ్ల కు భారీ సినిమాలు తీసే దమ్ము ఇప్పుడు ఉందా? అంటూ ఆయన సన్నిహితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. బండ్ల సినిమాల్లో గబ్బర్ సింగ్ తప్ప ఏదీ డబ్బులు తీసుకురాలేదు.
గోవిందుడు అందరి వాడేలే పెద్ద ఫ్లాప్ అయ్యింది. పైగా బండ్ల సొంత డబ్బులు పెట్టడని, చాలామంది బడా బాబులకు బండ్ల బినామీ అనీ, వాళ్ల డబ్బులతో సినిమా తీస్తాడని చెప్పుకొంటున్నారు. వాళ్లంతా ఇప్పుడు గణేష్‌కి దూరమయ్యారని, అందుకే బండ్ల ఖాళీ అయిపోయాడని తెలుస్తోంది. ఇప్పుడూ ఓ బడా బాబుని గణేష్ పట్టేశాడని, అందుకే... మళ్లీ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే... మరొకరు త్వరలోనే మునిగిపోవడం ఖాయమన్నమాట. బండ్లా.. బంపర్ ఆఫర్ పట్టేశావుగా!
Also Read