సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి..
on Aug 23, 2016
ప్రముఖ దర్శకుడు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్ దుర్మరణం చెందాడు. సుకుమార్ దగ్గర చాలా కాలం నుండి పనిచేస్తున్న విక్రమ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వార్త ఆలస్యంగా వెలుగు చూసింది. కూకట్ పల్లిలోని తను ఉండే రెయిన్బో అపార్ట్మెంట్ భవనం పై నుండి కింద పడి చనిపోయాడు. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. లేక కావాలనే తాను దూకాడా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఏం లేవని సినీ పరిశ్రమలో వినపడుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
కాగా మహేష్ బాబు తో సుకుమార్ చేసిన 1,నేనొక్కిడినే, ఎన్టీఆర్ తో చేసిన నాన్నకు ప్రేమతో, అల్లు అర్జున్ తో చేసిన షార్ట్ ఫిలిం, సుకుమార్ రచించి,నిర్మించిన కుమారి 21 ఎఫ్ చిత్రాలకు విక్రమ్ పనిచేశాడు.