కబాలి ఎఫెక్ట్ ఏమీ పడలేదు!
on Jul 27, 2016
విభిన్న చిత్రాలను ఎంచుకోవడంలోనే కాదు సదరు చిత్రంలో వైవిధ్యంగా కనిపించడానికి ఆహారహం శ్రమిస్తూ ఆ శ్రమకు తగ్గ ఫలితాన్ని విజయం రూపంలో అందుకొని అంతకంతకూ అఖండ విజయాలు సాధిస్తూ దూసుకుపోతున్నాడు సూర్య. ప్రస్తుతం "సింగం 3" షూటింగ్ లో బిజీగా ఉన్న సూర్య.. ఆ సినిమా పూర్తయిన వెంటనే "కబాలి" ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెండేళ్ల క్రితమే ఒప్పుకొన్నాడు.
ఆ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసిన రంజిత్, రజనీకాంత్ నుంచి పిలుపు రావడంతో సూర్య పర్మిషన్ అడిగి మరీ రజనీకాంత్ సినిమా మొదలెట్టాడు. గత శుక్రవారం విడుదలైన "కబాలి" నెగిటివ్ టాక్ తో సంబంధం లేకుండా కోట్లు కొల్లగొడుతోంది. ఆ ఉత్సాహంతోనే సూర్య సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నాడు రంజిత్. ఇకపోతే.. ఈ సినిమాలో సూర్య ఒక బాక్సర్ గా కనిపించనున్నాడని సమాచారం అందుతోంది!