రికార్డులు బద్దలుకొడుతున్న "కబాలి"
on Jul 23, 2016
నిన్న విడుదలైన రాజనీకాంత్ తాజా చిత్రం "కబాలి" ఫ్లాప్ టాక్ తెచ్చుకొన్నప్పటికీ.. రెండ్రోజులు ముందుగానే బుకింగ్ చేసుకొన్న జనాలు ఫ్లాప్ టాక్ ని సైతం పట్టించుకోకుండా రజనీకాంత్ ను చూసేందుకు ఉవ్విళ్ళూరుతూ థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. అందుకు తగ్గట్లే "కబాలి' ఫస్ట్ డే కలెక్షన్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.
ఆంధ్రా-నైజాంలో 9 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయగా.. నార్త్ అమెరికాలో కేవలం ప్రీమియర్ షోలకే రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తమిళనాడులోనూ దాదాపు 21 కోట్ల రూపాయల ప్రారంభ వసూళ్ళు చేసిందని తెలుస్తోంది. మొత్తంగా తెలుగు, తమిళ భాషలు కలుపుకొని దాదాపు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ ను వసూలు చేసిందని స్వయంగా నిర్మాత కలైపులి థాను నేడు ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. సో, గ్రాస్ కలెక్షనే 100 కోట్లు వచ్చిందంటే.. షేర్ తక్కువలో తక్కువ ఓ 70 కోట్లైనా రావడం ఖాయం. దాంతో "కబాలి" బాహుబలి కలెక్షన్లను మాత్రమే కాక ప్రపంచ సినిమా కలెక్షన్లను తిరగరాసిందనే చెప్పాలి!\