వర్మలో ఈ కొత్త యాంగిల్ ఏంది గురూ..!
on May 26, 2016
రాం గోపాల్ వర్మకు, వినయానికి చాలా దూరం ఉంటుంది. మీరు ఏ ప్రశ్నైనా అడగండి జవాబు మాత్రం చాలా వెటకారంగా వస్తుంది. సక్సెస్ వచ్చినా అలాగే ఉంటాడు. ఫెయిల్యూర్ వచ్చినా అలాగే ఉంటాడు. సంచలనాలు సృష్టించడం, మనిషికి బయటికి రాకుండా, శ్రమ పడకుండా ఇంట్లో కూర్చునే న్యూస్ కు సెంటారాఫ్ అట్రాక్షన్ అవడం వర్మకే సాధ్యం. అయితే రీసెంట్ గా వర్మ గారు ఒక విషయంగా చాలా వినయంగా మాట్లాడుతున్నాడు. నన్ను నేను తెలుసుకున్నాను. నా పొగరే అన్నింటికీ కారణం అంటూ తన వ్యక్తిత్వానికి సంబంధం లేని డైలాగులు చెబుతున్నాడు. ఇదేంటా సడెన్ గా వర్మకు ఏమైందబ్బా..అని అందరూ తెగ ఆలోచిస్తే, అప్పుడు అర్ధమైంది జనాలకు. బాలీవుడ్ లో వర్మ వీరప్పన్ రిలీజవుతోంది. ఆ సినిమా ప్రమోషన్ కోసం తనను తాను కొత్తగా బాలీవుడ్ కు పరిచయం చేసుకుంటున్నాడాయన. పైగా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ హిందీలో సినిమా తీస్తున్నాడు కదా..అది కూడా ఈ వినయానికి ఒక కారణం కావచ్చు. ఒక పిచ్చోడికి తాను పిచ్చోడినని ఎలా తెలియదో, అలాగే నాకు నేను ఎవరో తెలియదు అంటూనే, ఈ మధ్య ఖాళీగా ఉన్న టైంలో నన్ను నేను సరిగ్గా సరిచూసుకున్నా. నా ఫ్లాపులకు కారణం నా పొగరే అంటూ చెప్పుకొచ్చాడు వర్మ. వీరప్పన్ రిలీజై హిందీలో హిట్టయ్యిందనుకోండి..అప్పుడు కూడా ఇంతే వినయంగా ఉంటారా..వర్మ గారూ..?