దేవుడా.. నయనతార చెవి రింగును కూడా వదిలిపెట్టలేదు...
on Jan 9, 2017
నయనతార-దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమాయణం గురించి రోజుకో వార్త వస్తూనే ఉంటుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కొన్ని రోజులు.. పెళ్లి చేసుకున్నారని మరి కొన్ని రోజులు.. ఆఖరికి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చిన విషయం ఏంటంటే నయనతారా చెవి రింగులు. ఆశ్చర్యంగా ఉంది కదా... కొంత మంది హీరోలు, హీరోయిన్స్ తమకు నచ్చిన వ్యక్తుల పేర్లను టాటూస్ వేయించుకొని ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా సమంత కూడా అలాగే దొరికిపోయిందనుకోండి. ఇప్పుడు అదే కోణంలో చేతులు, మెడ.. ఇలా కంటికి కనిపించే శరీర భాగాల్లో ఏమైనా పచ్చబొట్లు ఉన్నాయా? అని అదే పనిగా వెతకడం మొదలు పెట్టారు మన ఔత్సాహికులు. అలా వారికి నయనతార ఇయర్ రింగ్స్ కనిపించాయి. అవి 'వి' ఆకారంలో ఉన్నాయి. ఇంకేముంది ‘వి ఫర్ విఘ్నేష్ శివన్’ అని అంటున్నారు. ప్రియుడి పేరు వచ్చేట్లుగా నయన ఇయర్ రింగ్స్ సెలక్ట్ చేసుకున్నారని అంటున్నారు. మొత్తానికి దేన్నైనా పాజిటివ్ గా తీసుకోవాలన్న సూత్రాన్ని మన వాళ్లు బాగా ఫాలో అవుతున్నట్టు ఉన్నారు. అందుకే ఆఖరికి చెవి రింగును కూడా వదిలిపెట్టలేదు. మరి ఆ 'వి' ఆంతర్యం ఏంటో నయనకే తెలియాలి.