కొడుక్కి సవాల్ విసిరిన నాగార్జున...
on Mar 29, 2017
నాగార్జున తన తనయుడు నాగచైతన్యకు సవాల్ విసిరారంట. ఇంతకీ ఏం విషయంలో నాగార్జున.. నాగచైతన్యకు సవాల్ విసిరారు అనుకుంటున్నారా..? అది నాగచైతన్య సినిమా ఫస్ట్‌లుక్ విషయంలో. ఇంతకీ అసలుసంగతేంటంటే... కల్యాణకృష్ణ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నాగచైతన్య హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. కానీ ఈ ఈ సినిమాకు సంబంధించి రెండు ఫస్ట్‌లుక్‌లను ఒకేసారి విడుదల చేస్తున్నారట. ఒకేసారి రెండు ఫస్ట్‌లుక్స్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలిపాడు చైతూ. దీనికి కారణం మొదట విడుదల చేయాలనుకున్న ఫస్ట్ లుక్ నాగార్జునకు అంతగా నచ్చలేదట. దాంతో ఆయన మరో ఫస్ట్‌లుక్‌ను సిద్ధం చేశాడట. దీంతో ఎవరు రెడీ చేసిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలో తెలియక ఒకేసారి రెండు ఫస్ట్‌లుక్‌లను విడుదల చేసెయ్యాలని డిసైడ్ అయిపోయాడు. దీంతో ఎవరు డిసైడ్ చేసిన ఫస్ట్‌లుక్ ఆదరణ పొందుతుందో చూద్దాం అంటూ ట్విట్టర్ ద్వారా చైతూకు సవాల్ విసిరాడు నాగార్జున. మరి ఎవరు రెడీ చేసిన ఫస్ట్ లుక్ ఎక్కువ ప్రజాదరణ పొందుతుందో చూద్దాం.