బాలీవుడ్ హీరోల వార్షిక ఆదాయం చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే
on Jun 14, 2017
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంపాదన అర్జుస్తున్న సెలెబ్రెటీల్లో ఇండియా నుండి ముగ్గురికి చోటు దక్కింది. వాళ్లేవరంటే... షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్. ఈ బాలీవుడ్ స్టార్ హీరోల వార్షిక ఆదాయం చూస్తే ఎవరికయినా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. 38 మిలియన్ డాలర్లతో అంటే మన కరెన్సీలో అక్షరాలా 245 కోట్ల సంవత్సర ఆదాయంతో షారుఖ్ ఖాన్ ఇండియాలో ముందంజలో ఉండగా, వరల్డ్ వైడ్ లిస్ట్ లో 71 వ స్థానం సంపాదించుకున్నాడు. తర్వాతి స్థానం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస హిట్లతో టాప్ హీరోగా కొనసాగుతున్న, సల్మాన్ సంపాదనలో మాత్రం రెండవ స్థానానికే పరిమితమయ్యాడు. దీనికి కారణం, షారుఖ్ ఖాన్ చేతిలో బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ ఎక్కువగా ఉండడమే. ఇంక, మూడవ స్థానానికి వస్తే, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ని పక్కకి నెట్టి అక్షయ్ కుమార్ ఆ స్థానాన్ని సంపాదించుకున్నాడు. సల్మాన్ ఖాన్ వార్షిక సంపాదన 238 కోట్లు ఉండగా, అక్షయ్ కుమార్ 2016 సంవత్సరానికి గాను 229 కోట్లు సంపాదించాడు. అమితాబ్ బచ్చన్, హ్రితిక్ రోషన్ ఇంకొందరు బాలీవుడ్ అగ్ర నటులకి ఈ లిస్ట్ లో చోటు దక్కలేదు. కొందరి వాదన ఏంటంటే, బ్లాక్ మనీ కూడా లెక్కేస్తే సదరు బాలీవుడ్ హీరోల సంపాదన అంతకు మించి ఉండొచ్చు.