రేవతి... మదర్ ఆఫ్ పుల్లెల గోపిచంద్!
on Aug 25, 2016
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్ ఏంటి? ఒలంపిక్స్ లో సింధు సిల్వర్ మెడల్ కొట్టడమే! మరి ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీకి తెలియదా? తెలిశాక ఊరికే కూర్చుంటారా? వెంటనే క్యాష్ చేసుకునేందుకు రెడీ అయిపోయారు! ఇంతకీ వియషం ఏంటంటే, సింధు సక్సెస్ కి కారణమైన పుల్లెల గోపిచంద్ బయోపిక్ తీయాలనుకుంటున్నారు ఎప్పట్నుంచో. ఈ యాంబీషియస్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్. ఇప్పటికే నేషనల్ అవార్డ్ సాధించి తన సత్తా చాటిన సత్తార్ తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పుల్లెల గోపిచంద్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోన్న సినిమాలో ఆయన తల్లి సుబ్బరావమ్మ పాత్రలో రేవతి కనిపించనుంది! ఎన్నో అద్భుత పాత్రలతో రేవతి తెలుగు వారికి బాగా తెలిసిన ఆర్టిస్టే. రీసెంట్ గా బ్రహోత్సవం సినిమాలోనూ ఆమె నటించింది. అయితే, గోపిచంద్ సక్సెస్ లో ఎంతో కీ రోల్ ప్లే చేసిన ఆయన తల్లి సుబ్బరావమ్మ క్యారెక్టర్ రేవతి చేయటం సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. పుల్లెల గోపిచంద్ గా సుధీర్ బాబు కనిపించనున్నాడు...