జోష్ లేని కబాలి తెలుగు ఆడియో ఫంక్షన్
on Jun 26, 2016
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కబాలి. సంతోష్ నారాయణన్ సంగీతం ఇచ్చిన ఈ సినిమా తమిళ ఆడియో రీసెంట్గా ముగిసింది. ఇకపోతే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తెలుగు ఆడియో ఇవాళ హైదరాబాద్ జె.ఆర్.సీలో జరిగింది. రజనీ మ్యానియా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడ కనిపిస్తే అక్కడ అభిమానుల సునామీనే..అలాంటిది ఆయన నటించిన కబాలి ఆడియో ఫంక్షన్ హైదరాబాద్‌లో జరగబోతోందని తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే వీరందరిని రజనీ నిరాశ పరిచారు. ఫంక్షన్‌కు వచ్చిన పెద్దలంతా రజనీని ఆకాశానికెత్తేశారు. కానీ సూపర్‌స్టార్ మాత్రం వేడుకకు రాలేదు. ఇక రజనీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆడియో రిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆయన కూడా డుమ్మా కొట్టడంతో ఫంక్షన్లో జోష్ లేదు. ఎవరు లేకపోవడంతో మెగా హీరో వరుణ్ తేజ్ చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది.