Home »
మహేష్ డబుల్ రోల్ చెయ్యట్లేదు
on Aug 27, 2014
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ లలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ఆయన ఇప్పటికి వరకు డిఫరెంట్ పాత్రలు చేసిన ఏ సినిమాలోనూ ద్విపాత్రాభినయం చేయలేదు. తొలిసారిగా కొరటాల శివ దర్శకత్వం చేయబోయే సినిమాలో డబల్ యాక్షన్ చేయబోతున్నారని కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై కొరటాల శివ స్వయంగా స్పందించారు. తన సినిమాలో మహేష్ డబల్ రోల్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలన్ని పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు. అలాగే ఈ సినిమాలో మహేష్ చాలా కొత్త లుక్ లో డిఫరెంట్ గా కనిపిస్తాడని అన్నారు. దీంతో మహేష్ బాబును డ్యూయిల్ రోల్ లో చూద్దామని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురయ్యింది.