ENGLISH | TELUGU  
Home  » 

ఆగడు స్టోరీ లీక్

on Jun 6, 2014


font-style: normal; font-variant: normal; font-weight: normal; letter-spacing: normal; line-height: normal; text-align: center; text-indent: 0px; text-transform: none; white-space: normal; word-spacing: 0px; background-color: rgb(255, 255, 255);">Aagadu Story Leaked, Mahesh Babu Aagadu Story, Aagadu Story Got Leaked, Aagadu Movie Story
 
టీజర్ విడుదలైనప్పటి నుంచి  సినీ వార్తల్లో ప్రధానంగా నిలుస్తోంది ‘ఆగడు’.ఆ సెన్సేషన్ ఇంకా ఆగక ముందే ‘ఆగడు’సినిమా కథ లీక్  అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఆగడు’ టీజర్ వివాదం మహేష్ ఇచ్చిన క్లారిటీతో ముగుస్తుందని చిత్ర యూనిట్ కాస్త కుదుట పడే లోపు ఈ సంచలనం మొదలైంది. మైనింగ్ మాఫియాను హైలెట్ చేస్తూ సినిమా కథను రూపొందించారని, అందుకే గనులుండే బళ్లారి ప్రాంతంలో ఎక్కువగా షూటింగ్ జరింగిందని కథనాలు వినిపిస్తున్నాయి. మైనింగ్ వలన ప్రభుత్వం నష్టపోవడం, అక్కడి అధికారులు బలైన తీరు ఇందులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలను  అరికట్టే పోలీసుగా మహేష్ నటిస్తున్నాడంటూ స్టోరీ ప్రచారం మొదలైంది. అయితే ఇది టీజర్ చూసి అప్పటికప్పుడు ఎవరైన తయారు చేసి కూడా వుండవచ్చునేమో అని కూడా అంటున్నారు కొందరు. దూకుడు సినిమాలో కూడా బళ్లారి గురించిన చిన్న ట్రాక్ సీన్ శ్రీను వైట్ల అందించారు. ఇప్పుడు దాన్నే ఫుల్ లెంగ్త్ స్టోరీగా చేసి సినిమా రూపొందిస్తున్నారని గాసిప్స్ మొదలయ్యాయి. టీజర్ వివాదం ఇంకా చల్లారక ముందే ఈ రకంగా గాసిప్స్ రావడం దర్శక, నిర్మాతలను కంగారు పెడుతోందట.



Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.