Celebrities IPhone App     top news
TMDB - TeluguOne Movie Database, Telugu cinema News, Telugu Movie News, Telugu cinema reviews, latest telugu movies, Telugu Film newsNews, Telugu movies online
తెలుగు సినిమా ఇంటర్వ్యూస్
   ఇంటర్వ్యూస్   
ప్రిన్స్ మహేష్ బాబు ఇంటర్వ్యూ
Feb 4, 2012 Like This :
Facebook Twitter Google

ఒక్కడు చిత్రం నుంచి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుని, పోకిరితో ఎవరికీ అందనంత ఎత్తుకి ఎదిగి, ఇటీవల। దూకుడు, బిజినెస్ మ్యాన్ చిత్రాలతో తనకు తానే సాటి, తనకు తానే పోటీ అని నిరూపించుకున్న ప్రిన్స్ మహేష్ బాబుతో తెలుగువన్ ప్రత్యేకంగా జరిపిన ఇంటర్ వ్యూ మీకోసం....!

తెలుగువన్ - మహేష్ గారూ వరసగా మీ రెండు చిత్రాలు "దూకుడు", "బిజినెస్ మ్యాన్" బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి. ఈ ఆనందాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు...?

మహేష్ బాబు - వెరి వెరి హ్యాపీ అండి...! నా సినిమాలకు అంత విజయం అందించిన ప్రేక్షకులకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. తెలుగువన్ - "దూకుడు" ఒక స్టైల్ పాత్రయితే "బిజినెస్ మ్యాన్" మరో స్టైల్ పాత్ర...బిజినెస్ మ్యాన్ లో మొత్తం మీరే కనపడతారు...! అందులోనూ పూరీ జగన్నాథ్ ఈ కథ చెప్పినప్పుడు "పోకిరి" కాంబినేషన్ తీసే కథలాగా మీకనిపించిందా...?

మహేష్ బాబు- "ఖలేజా", "దూకుడు" చిత్రాలకు ముందు నా మీద మహేష్ కామెడీ బాగా చెయ్యలేడనే ఓ చిన్న అపవాదుండేది. ఆ సినిమాలతో అది పోయింది. తర్వాత వచ్చిన "బిజినెస్ మ్యాన్" సినిమాలో మొత్తం నేనే కనపడతాను. సినిమాలో 80 సీన్లుంటే 75 సీన్లలో నేనుంటాను. అందరికంటే నేనే ఈ సినిమాలో ఎక్కువ మాట్లాడతాను. ఒక సింగిల్ థ్రెడ్ లాగా ఈ సినిమాలో నా పాత్ర ఉంటుంది. అసలు పూరీ గారు నాకీ కథ చెప్పినప్పుడే నా పాత్ర నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కథ వినగానే పూరీ గారు, నేను ఏం ఫీలయ్యామో అది నిజమని ఈ రోజు ప్రేక్షకులు నిరూపించారు.

తెలుగువన్ - "బిజినెస్ మ్యాన్" చిత్రంలో బూతులు ఎక్కువగా ఉన్నాయని ఒక అపవాదుంది. దానికి మీరేమంటారు...?

మహేష్ బాబు - ఇప్పుడు టీ కొట్టేవాడు మాట్లాడే భాష ఒక స్టైల్లో ఉంటుంది. అలాగే మాఫియా డాన్ అవ్వాలనుకునే వాడి భాష అలాగే ఉంటుంది. వాడు సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ వాడితే జనానికి నచ్చదు. మాఫియా డాన్ ఎలా మాట్లాడతాడో "బిజినెస్ మ్యాన్" చిత్రంలో నా పాత్ర అలాగే మాట్లాడుతుంది. సినిమాలో బూతులున్నాయా, భాష ఎలాగుంది అన్న విషయాలు పూరీ గారికొదిలేశాను. ఆయన్ని పూర్తిగా నమ్మాను. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. వెరి వెరి థ్యాంక్స్ టు పూరీ గారు.

తెలుగువన్ - మీరు ఇంతమంది హీరోయిన్లతో నటించారు కదా...! ఎవరూ మీకు ఐ లవ్ యూ చెప్పలేదా...?

మహేష్ బాబు - నాకు పెళ్ళయిందండీ...నాకెలా చెపుతారు ఐ లవ్ యూ...?

తెలుగువన్ -మీ రికార్డులు మీరే అధిగమిస్తున్నారు...మీకు మీరే పోటీగా నిలుస్తున్నారు...! ప్రస్తుతం మన తెలుగు సినీ పరిశ్రమలో నంబర్ వన్ స్థానం మీదేనని భావిస్తున్నారా...?

మహేష్ బాబు - నాకు నంబర్ల మీద నమ్మకం లేదండి. మన పని మనం సిన్సియర్ గా చేసుకుంటూ పోవటమే నాకు తెలిసింది. తెలుగువన్ - ఈ మధ్య మీ అభిమానులకు మరో యువ హీరో అభిమానులకూ మధ్య రికార్డుల గురించి గొడవ జరిగింది...దీని మీద మీ స్పందన ఏమిటి...?

మహేష్ బాబు - ఫ్యాన్స్ ఈ రికార్డుల విషయంలో బాగా ఎగ్జయిటవుతారు...అలాగే పర్సనల్ గా కూడా తీసుకుంటారు... అది ఉండాలి...! లేకపోతే ఎప్పటి రికార్డులో ఇంకా అలా ఉండిపోతే ఎలా...? కొత్తదనం రావాలి...కొత్త కొత్త రికార్డులు క్రియేట్ అవ్వాలి...అప్పుడే సినీ పరిశ్రమ కళకళలాడుతూ ఉంటుంది...!

తెలుగువన్ - మీకు మీ నాన్నగారు తర్వాత సీనియర్ యన్ టి ఆర్ అభిమాన హీరో అని చెప్పారు....ఆయన సినిమాలేమేం చూశారు...?

మహేష్ బాబు - ఆయన సినిమాలు చూస్తూనే కదండీ మనమంతా పెరిగింది. ఆయన నటించిన "పాతాళ భైరవి" ఎన్నిసార్లు చూశానో లెక్కలేదు.

తెలుగువన్ - మీ నాన్నగారు నటించిన "అల్లూరి సీతారామరాజు" సినిమా కానీ, లేదా మీకు నచ్చిన ఆయన సినిమాలేమైనా రీమేక్ చేసే ఆలోచన ఏమైనా ఉందా...?

మహేష్ బాబు - నాన్నగారు నటించిన సినిమాలు రీమేక్ చేసే ఆలోచనలేమీ లేవండీ...! "అల్లూరి సీతారామరాజు" ఒక క్లాసిక్. దాన్ని నేను చేయలేను. అనవసరంగా వాటిని పాడు చేయటం నాకిష్టం లేదు...!

తెలుగువన్ - మీకు డ్రీమ్ రోల్ ఏదైనా ఏందా...?

మహేష్ బాబు - అలాంటిదేం లేదండీ...అసలు ఏదీ నేను ప్లాన్ చేసుకోను...! వచ్చిన సినిమాల్లో నచ్చినవి చేయటం తప్ప...ఫలానా పాత్రలో నటించాలని ప్లాన్ చేసుకోవటంలాంటివేం లేవు.

తెలుగువన్ - ప్రస్తుతం "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాలో వెంకటేష్ గారితో నటిస్తున్నారు...భవిష్యత్తులో ఇలాంటి మల్టీ స్టారర్ సినిమాల్లో ఇంకా నటించే అవకాశం ఉందా...?

మహేష్ బాబు - తప్పకుండా స్క్రిప్ట్ నచ్చి, నా పాత్ర నచ్చితే తప్పకుండా మల్టీ స్టారర్ సినిమాల్లో నటిస్తాను...!

తెలుగువన్ - మీరు పనిచేయాలనుకుంటున్న దర్శకులెవరైనా ఉన్నారా...?

మహేష్ బాబు -మణిరత్నం, శంకర్ వంటి దర్శకులతో చేయాలనుంది. శంకర్ గారితో "3 ఇడియట్స్", మణిరత్నం గారితో ఒక హిస్టారికల్ మూవీ చేయాల్సింది. అనుకోకుండా అవి మిస్సయ్యాయి. భవిష్యత్తులో వాళ్ళతో సినిమాలు చేస్తాను.

తెలుగువన్ - గౌతమ్ ని బాలనటుడిగా పరిచయం చేసే ఉద్దేశ్యం ఉందా...?

మహేష్ బాబు - హి ఈజ్ జస్ట్ ఎ కిడ్ అండీ...వాణ్ణి చదుకోనివ్వండి...ఆ తర్వాత వాడికేమవ్వాలనిపిస్తే అదవుతాడు...వాణ్ణి ఫోర్స్ చేసి నటుణ్ణి చేయటం నాకిష్టం లేదు...!


తెలుగువన్ - ఇంతసేపూ మీ విలువైన సమయాన్ని మా తెలుగువన్ ప్రేక్షకుల కోసం కేటాయించి, మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు మా ధన్యవాదాలు.

మహేష్ బాబు - మీ క్కూడా థ్యాంక్సండీ...! మీ ద్వారా ప్రవాసాంధ్రులందర్నీ ఇలా కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది.

 
<<   వై.వి.యస్.చౌదరి ఇంటర్వ్యూ RGV ఇక ఆపేయమ్మ చూళ్ళేకపోతున్నాం   >>
Be the first one to post comment.
 
Related Movie Interviews
మహేశ్ పై వర్మ మోజు!
మహేశ్ బాబు సో సెక్సీ...ఎంత అంటే సన్నీ లియోన్ కన్నా 10రెట్లు. బాబోయ్ మహేశ్ బాబుకి-సన్నీ లియోన్ కి పోలికేంటి? ఇంత మాట అన్న అమ్మాయి ఎవరు అంటారా? అమ్మాయి అంటే వింతేముంది....వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ కామెంట్ ఇది. వర్మ కళ్లు మహేశ్ పై పడ్డాడేంటా అని ఆరాతీస్తే
More »
మ‌హేష్ కూడా చేతులు కాల్చుకొంటాడా?
చిత్ర నిర్మాణం అనేది ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. హేమా హేమీలైన‌వాళ్లే నిర్మాత‌లుగా డింకీలు కొడుతుంటారు. ప‌రిశ్ర‌మ‌లో ఏ నిర్మాత ప‌రిస్థితీ బాలేదు. అలాంటిది ఈ విష‌యాల‌న్నీ తెలిసి తెలిసి త‌ప్పు చేయ‌బోతున్నాడు మ‌హేష్ బాబు. ఔను..
More »
తానాకి.. మ‌హేష్ ఝ‌ల‌క్‌!!
ఈయేడాది జులైలో అమెరికాలో జ‌రిగే తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) వేడుక‌ల‌కు మ‌హేష్ బాబు హాజ‌ర‌వుతాడ‌ని, ఈ వేడుక‌ల‌కు పిలిచినంద‌కు మ‌హేష్ రూ.1.5 కోట్లు డిమాండ్ చేశాడ‌ని వార్తలొచ్చాయి. ఈ డ‌బ్బుని ఓ ఛారిటీకి మ‌హేష్ అందించాడ‌నికి కూడా చెప్పుకొన్నారు. అయితే ఇప్పుడు తానా వేడుక‌ల‌కు మ‌హేష్ వెళ్ల‌డం లేద‌ట‌. దానికి కార‌ణం.
More »
మదర్ తో మహేష్ బాబు
మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ ‘శ్రీమంతుడు’.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా కొన్ని ఫోటోలు బయటకువచ్చాయి. ఇందులో మహేష్‌బాబుకు మదర్‌గా సుకన్య నటిస్తోంది. వీళ్లిద్దరు ఇంట్లో మాట్లాడుతున్న స్టిల్స్ నెట్టింట్లో హంగామా
More »
మ‌హేష్‌కి డ‌బ్బంటే ఆశ ఎక్కువే సుమీ..?!
తెలుగునాట మ‌హేష్ బాబుది చెక్కు చెద‌ర‌ని క్రేజ్‌. దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారంతా మ‌హేష్‌ని పిచ్చ పిచ్చ‌గా ఆరాధిస్తారు. అందుకే మ‌హేష్ అటు ఇమేజ్‌లోనూ, ఇటు క్రేజ్‌లోనూ.... మొత్తానికి పారితోషికంలోనూ నెంబ‌ర్‌వ‌న్‌. ఎంటార్స్‌మెంట్ల విష‌యంలోనూ మ‌హేష్‌కి పోటీ లేదు. సెక‌న్ల‌పాటు క‌నిపించే యాడ్‌లో క‌నిపించాలంటే కోట్లు ధార‌బోయాల్సిందే.
More »