English | Telugu

మంచు మనోజ్ విడాకులు తీసుకున్నాడు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండో కుమారుడు, హీరో మంచు మనోజ్ విడాకులు తీసుకున్నాడు. ట్విట్టర్ వేదికగా బాధాతప్త హృదయంతో ఈ రోజు ఆ విషయాన్ని ప్రకటించాడు. ఇద్దరి మధ్య డిఫరెన్సులు రావడంతో విడాకులు తీసుకున్నట్టు మనోజ్ తెలిపాడు. ఈలోపు చాలా..

నిజమే... రాజశేఖర్ ఆ సినిమా చెయ్యట్లేదు!

తమిళ దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తితో ఓ సినిమా చేయడానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఓ తమిళ నిర్మాత కూడా ముందుకొచ్చారు. దర్శక నిర్మాతలతో రాజశేఖర్, జీవిత రెండుమూడు సార్లు సమావేశం అయ్యారు. స్క్రిప్ట్ నుండి డైలాగుల వరకూ..

డీప్ ఫోకస్: 'సైరా' కలెక్షన్స్.. జెన్యూన్ వర్సెస్ ఫేక్!

చిరంజీవి పన్నెండేళ్ల కల 'సైరా.. నరసింహారెడ్డి' సినిమా తెలుగునాట మినహా మిగతా అన్ని ఏరియాల్లోనూ ఫ్లాప్ కావడం ఖాయమని తేలింది. నిజానికి ఒక చరిత్రకు.. అందునా బ్రిటిషర్లపై రాజీలేని పోరుసల్పి, ఆ పోరులో ప్రాణాల్ని పణంగా పెట్టిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథకు.. సాక్షీభూతంగా నిలిచిన సినిమాని తెలుగువాళ్లు సొంతం చేసుకోవాలి.

తండ్రి మరణించాక ఓంకార్‌ ఏం చేశాడంటే...

టీవీ ఆడియన్స్‌కు ఓంకార్‌ అన్నయ్య గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. రియాలిటీ డ్యాన్స్‌ షోలు, టీవీ ప్రోగ్రామ్స్‌తో పాపులర్‌ అయ్యారు. సినిమా ఆడియన్స్‌కు..

సాయి పల్లవి... అంతకు మించి!

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అనుకోని అతిథి'. అంతకు మించి... అనేది ఉపశీర్షిక. మలయాళం ఘన విజయం సాధించిన 'అధిరన్'కు తెలుగు అనువాదం ఇది. నవంబర్ 15న ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకుల..

చుట్టాలు కలిసి నటించిన సినిమాలు ఎలా ఆడాయి?

ఒక్కసారి టాలీవుడ్ హిస్టరీని పరిశీలిస్తే, ఒక ఇంట్లోని వాళ్లు, చుట్టాలు కలిసి నటించిన సినిమాలు కొల్లలుగా కనిపిస్తాయి. అయితే మామా అల్లుళ్ల వరుస అయ్యేవాళ్లు కలిసి చేసిన సినిమాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలైతే.. ఇదివరకు రెండే కనిపిస్తాయి.

మహేష్ సైనికుడిగా కనిపించేది ఎంతసేపు?

'సరిలేరు నీకెవ్వరు'లో మహేష్ బాబు మిలటరీ ఆర్మీ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. ఆర్మీ డ్రస్సులో సినిమాలో మహేష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇండియన్ ఆర్మీకి అంకితం ఇస్తూ ఒక పాట కూడా విడుదల చేశారు. అయితే... సినిమాలో ఆర్మీ ఎపిసోడ్ ఎంతసేపు ఉంటుందో.....

బన్నీ 'ఐకాన్' ఆగిందా?

చేగువేరా బయోపిక్‌గా హాలీవుడ్‌లో వచ్చి క్లాసిక్‌గా నిలిచిన 'ద మోటార్ సైకిల్ డైరీస్' ఆధారంగా 'ఐకాన్' స్క్రిప్టును వేణు శ్రీరాం రాసుకున్నాడనేది సమాచారం. దాని ఫైనల్ స్క్రిప్ట్ విషయంలో బన్నీ హ్యాపీగా లేడనీ, అందుకే ఆ ప్రాజెక్టును వద్దనుకుంటున్నాడనీ ప్రచారం జరుగుతోంది.

'ఆర్.డి.ఎక్స్. లవ్' సినిమా రివ్యూ

'ఆర్.డి.ఎక్స్. లవ్' టీజర్ హాట్ అయితే... ట్రైలర్ నీట్. టీజర్లో హీరోయిన్ అందాలను ఎక్కువ చూపిస్తే... ట్రైలర్లో ఊరి సమస్యలు, సందేశం అంటూ సామాజిక సినిమా అన్నట్టు చూపించారు. 'ఆర్.ఎక్స్. 100' తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ నటించిన చిత్రమిది. అసలు, సినిమా ఎలా ఉంది? రివ్యూ చదవండి.

అప్పుడు 'పాయల్ నాట్ ఫిట్' అన్నారు.. ఇప్పుడు టాప్ 10 హీరోయిన్స్‌లో ఒకదాన్నయ్యాను!

'ఆర్ఎక్స్ లవ్' సినిమాకు ముందు ముంబైలో ఆరేళ్లు చాలా స్ట్రగులయ్యాననీ, ఆడిషన్ చేసిన డైరెక్టర్లు 'పాయల్ నాట్ ఫిట్' అనేవాళ్లనీ, కనీ ఇవాలా సౌత్ ఇండియా టాప్ 10 హీరోయిన్స్‌లో ఒకదాన్నిగా పేరు తెచ్చుకున్నానంటూ ఉద్వేగానికి గురైంది పాయల్ రాజ్‌పుత్.

నితిన్, కీర్తి సురేశ్ జంటగా 'రంగ్ దే' మొదలైంది

నితిన్, కీర్తి సురేశ్ తొలిసారి కలిసి నటిస్తోన్న 'రంగ్ దే' మూవీ నిర్మాణ కార్యక్రమాలు విజయ దశమి పండగ రోజు లాంఛనంగా మొదలయ్యాయి. 'తొలిప్రేమ', 'మిస్టర్ మజ్ను' చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

'ఎఫ్2' మాదిరే 'వెంకీ మామ' కూడా ఇరగదీసేట్లే ఉన్నాడు!

నిజ జీవితంలో మేనమామ, మేనల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య అవే తరహా పాత్రల్ని పోషిస్తోన్న సినిమా 'వెంకీ మామ'. కె.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీకి సంబంధించి 'ఫస్ట్ గ్లింప్స్' పేరుతో విడుదలైన వీడియో యూట్యూబ్‌లో నంబర్ వన్ ప్లేస్‌లో ట్రెండింగ్ అయ్యింది.

మనిషి మరణిస్తే ఏడవాలా? నవ్వాలా?

ఎవరైనా మరణిస్తే ఏడవాలా? నవ్వాలా? మామూలుగా అయితే మనకు, మనసుకు దగ్గరైన వ్యక్తులు మరణిస్తే ఏడుస్తాం. మనకు తెలియకుండానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. మనసుకు భారంగా ఉంటుంది. మనకు తెలియని వ్యక్తులు మరణించినా... 'అయ్యో పాపం' అనుకుంటాం.

నటనలోనే కాకుండా చదువులోనూ రాణిస్తున్న ఈ తరం హీరోయిన్స్...

ఈ తరం హీరోయిన్స్ అందం, నటనలోనే కాకుండా చదువులోనూ రాణిస్తున్నారు. మహానటిలో మరో సావిత్రమ్మలా ట్రెడిషనల్ గా మెప్పించిన కీర్తి సురేష్ నిజ జీవితంలో మాత్రం ఫ్యాషన్ స్టూడెంట్. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఈ మల్లూ బ్యూటీ డిగ్రీ చేసింది. హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్..

తమన్నాకు నచ్చలేదు... కాజల్‌కి నచ్చింది!

తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా ఓంకార్ దర్శకత్వం వహించిన 'రాజుగారి గది 3'లో కథానాయికగా ముందు తమన్నాను తీసుకున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు కూడా! కానీ, సినిమాలో మాత్రం మిల్కీ బ్యూటీ లేరు. అవికా గోర్ నటించారు. విడుదలకు...

డిసెంబర్ 20న 'ప్రతిరోజూ పండగే'

సాయితేజ్ కథానాయకుడిగా నటిస్తోన్న 'ప్రతిరోజూ పండగే' సినిమా విడుదల తేదీ వెల్లడైంది. మారుతి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. సాయితేజ్ జోడీగా...

బాలకృష్ణతో మెగా మేనల్లుడు ‘ఢీ’

మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్‌ ‘అల... వైకుంఠపురములో’ సినిమాల సంక్రాంతి సమరం గురించి ఇటు ఇండస్ట్రీలో, అటు సోషల్‌ మీడియాలో ప్రేక్షకాభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సంక్రాంతికి ముందే... క్రిస్మస్‌ బరిలో మరో సమరానికి

ప్రభాస్‌ అన్న చేయాలి... నేనింకా బచ్చాగాడినే!

ఆర్నాల్డ్‌ ష్వార్జనెగ్గర్‌ నటించిన హిట్‌ ఫిల్మ్‌ ఫ్రాంచైజీ ‘టెర్మినేటర్‌’ తరహా యాక్షన్‌ సినిమాలు ప్రభాస్‌ అన్న చేయాలనీ... చేస్తే బాగుంటుందనీ... అటువంటి సినిమాలు చేయడానికి నేనింకా బచ్చాగాడినే అనీ యంగ్‌ సన్సేషనల్‌ హీరో, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ అన్నారు....

బ్రహ్మాజీని చితక్కొట్టిన హీరోయిన్‌!

హీరోయిన్‌కి కమెడియన్‌ లైన్‌ వేసే కాన్సెప్ట్‌ మీద చాలామంది దర్శకులు కామెడీ పండించారు. అలాగే, కమెడియన్‌ని ఇతర ఆర్టిస్టుల చేత కొట్టించడం కాన్సెప్ట్‌తోనూ బోలెడు సినిమాల్లో ఫన్‌ పుట్టించారు. ఫర్‌ సపోజ్‌... హీరోయిన్‌కి, అదీ దెయ్యం ఆవహించిన హీరోయిన్‌కి కమెడియన్‌ లైన్‌ వేస్తే?...

'లస్ట్ స్టోరీస్' డైరెక్టర్... తరుణ్ భాస్కర్!

దర్శకురాలు నందినీరెడ్డి క్లారిటీ ఇచ్చారు... 'ఆల్రెడీ సబ్‌టైటిల్స్‌తో వచ్చిన 'లస్ట్ స్టోరీస్'ను నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ఎందుకు రీమేక్ చేయాలనుకుంటుంది? ఈ రూమర్స్ ఏంటో?' అని 'లస్ట్ స్టోరీస్' తెలుగు వెర్షన్ కి నందినీరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని వార్తలు రాసినవారిపై సోషల్...

'ఆర్ ఆర్ ఆర్'లో అజయ్ దేవగణ్ కేరెక్టర్ ఇదేనా?

అజయ్ దేవగణ్ 'ఆర్ ఆర్ ఆర్'లో విలన్‌గా కనిపించనున్నాడంటూ వదంతులు వినిపించాయి. దాంతో పాటు రాంచరణ్ తండ్రి కేరెక్టర్‌లో ఆయన కనిపించనున్నాడంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే అజయ్ చేస్తున్నది విలన్ కేరెక్టర్ కాదనీ...

'వార్' బాక్సాఫీస్: 2019 బిగ్గెస్ట్ హిట్ దిశగా...

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన మల్టీస్టారర్ 'వార్' హవా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా దసరా సీజన్‌లో  200 కోట్ల రూపాయల క్లబ్‌లో జాయినయ్యింది. ఇప్పటివరకూ ఆ సినిమా హిందీ వెర్షన్ ఒక్కటే దేశవ్యాప్తంగా 228.50 కోట్ల రూపాయలను వసూలు చేసిందని అంచనా.

బాక్సర్‌గా వరుణ్ తేజ్ నటించే సినిమా స్టార్టయ్యింది!

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 10వ చిత్రం షూటింగ్ గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. కిరణ్ కొర్రపాటి డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ మూవీని రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు వెంక‌టేశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కొత్త ప్రేమికుడి కోసం శ్రుతి హాసన్ వెయిటింగ్

ఒకసారి ప్రేమలో వైఫలమైతే... మరోసారి ప్రేమలో పడకూడదని నియమ నిబంధనలు ఏమీ లేవు. జీవితంలో ఒక్కరిని మాత్రమే ప్రేమించాలని, ఒక వ్యక్తితో బ్రేకప్ అయిన తర్వాత మరో వ్యక్తితో ప్రేమలో పడకూడని ఎవరూ రాజ్యాంగంలో రాయలేదు. సో...

'సీనయ్య'గా వినాయక్ నటిస్తున్న సినిమా షూటింగ్ షురూ

టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకరైన వి.వి. వినాయక్ హీరోగా వెండితెరపై కనిపించేందుకు సిద్ధమయ్యాడు. 'సీనయ్య' పేరుతో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. డైరెక్ట‌ర్ శంకర్ శిష్యుడు నరసింహ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ వినాయక్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ప్రారంభమైంది.

తెలుగునాట 'సేఫ్' దిశగా 'సైరా'!

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా.. నరసింహారెడ్డి' సినిమా తెలుగునాట సంతృప్తికర కలెక్షన్లను సాధిస్తూ ముందుకు పోతోంది. దేశంలోని మిగతా ఏరియాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ కలెక్షన్లు బాగున్నాయి. ఆరు రోజుల్లోనే బయ్యర్ల పెట్టుబడిలో మూడింట రెండు వంతులు పైగా వసూలు చేసిన 'సైరా'.. సేఫ్ దిశగా అడుగులు వేస్తోంది.

బాలకృష్ణ 105వ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

సంక్రాంతి 2020కి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల... వైకుంఠపురములో', నందమూరి కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా' చిత్రాలు విడుదల కానున్నాయి. అంతకు మించి పెద్ద పోటీ ఏమీ లేదు. కానీ, సంక్రాంతికి ముందు వచ్చే పెద్ద పండుగ, ఏడాదిలో చివరి పండగ క్రిస్మస్ కి ఎక్కువ పోటీ.....

విమర్శలను ఎదుర్కొంటున్న 'సామజవరగమన' సాంగ్...

'అల.. వైకుంఠపురములో' నుంచి ఓ సాంగ్ విడుదలైంది, దుమారం మొదలైంది, పాట బావుందనే ప్రశంసలు ఒకవైపు సాగుతూ ఉంటే విమర్శల దుమారం కూడా అదే రేంజ్ లో సాగుతోంది. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' సక్సెస్ ల తర్వాత మూడో సారి త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్...

'సోలో బ్రతుకే సో బెటర్' అంటున్న సాయితేజ్

  సాయితేజ్ హీరోగా 'సోలో బ్రతుకే సో బెటర్' అనే సినిమా రూపొందనున్నది. ఈ మూవీ ద్వారా సుబ్బు అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బేనర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించే ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.  

Movie Reviews

Latest News

Video-GossipsGallery

మెగా అవార్డుల కోసం మెగాస్టార్ మీటింగులు?

మెగాస్టార్ చిరంజీవి రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు, రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందించిన చారిత్రక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' చూడమని కోరారు. నిన్నటికి...

నేచురల్ బ్యూటీ!

'మహానటి' మూవీతో కీర్తి సురేశ్ కెరీర్ మరో మలుపు తిరిగింది. మహానటి సావిత్రిగా ఆమె చేసిన నటనతో కీర్తి తెలుగు ప్రేక్షకుల హృదయల్లో చెరగని ముద్ర వేసింది. ఆ సినిమా తర్వాత పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న కేరెక్టర్ అంటే డైరెక్టర్లకు కీర్తి గుర్తుకు వస్తోందంటే అతిశయోక్తి కాదు.

ఆ క్యారెక్టర్స్ నాకు వద్దు... హీరోయిన్‌గానే నాకు ముద్దు

కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, శ్రియ వంటి అతికొద్ది మంది హీరోయిన్లు మాత్రమే పదేళ్లుగా తమ అందచందాలను, ప్రేక్షకుల్లో అభిమానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ స్టార్‌ హీరోల పక్కన ఛాన్సులు అందుకుంటున్నారు. అప్పట్లో నాగార్జున, రవితేజ, తరుణ్‌..

సంక్రాంతికి మహా సమరమే!

అనూహ్యంగా 'వెంకీ మామ' మూవీ సంక్రాంతి విడుదలకు సై అనడంతో.. ఒక్కసారిగా సంక్రాంతి సీజన్ వేడెక్కిపోయింది. ఇప్పటికే మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ ఫిల్మ్ 'అల.. వైకుంఠపురములో'.. రెండూ జనవరి 12న వస్తున్నట్లు అఫిషియల్ అనౌన్స్‌మెంట్స్ వచ్చాయి.

రామ్‌చరణ్‌ లేడు... చిరంజీవి మాత్రమే!

కొరటాల శివ కొత్త సినిమాలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటించడం లేదు. మెగాస్టార్‌ చిరంజీవి మాత్రమే ఉన్నారు. ఆయనే హీరో. రామ్‌చరణ్‌ గానీ... మరో హీరో గానీ... ఎవరూ లేరు. కమర్షియల్‌ మీటర్‌లో, పక్కా చిరంజీవి స్టైల్‌లో ‘ఠాగూర్‌’, ‘స్టాలిన్‌’ టైపులో మెసేజ్‌ ఇచ్చేలా ఉంటుంది. ఇదీ పక్కా న్యూస్‌. రీసెంట్‌గా చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి ఒక సినిమా చేయబోతున్నారని...

'పంజా' టైమ్‌లో పవన్‌కల్యాణ్‌ ముందే గొడవ

పవన్‌కల్యాణ్‌ హీరోగా తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ తీసిన 'పంజా' ప్లాప్ కావొచ్చు. కానీ, ఆ సినిమాలో పవన్ స్టైల్, కాస్ట్యూమ్స్ సూపర్ హిట్. అందులో డైలాగులు కూడా హిట్టే. అబ్బూరి రవి 'సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం ఎంత..

నందినీరెడ్డి 'లస్ట్ స్టోరీస్' చెయ్యట్లేదా?

హిందీలో 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు. ఈ సిరీస్ ఇప్పుడు తెలుగులో రాబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే తెలుగు 'లస్ట్ స్టోరీస్'కు తను డైరెక్ట్ చేస్తున్నాననే ప్రచారాన్ని నందినీరెడ్డి ఖండించింది.

'ఆర్డీఎక్స్ లవ్'తో పాయల్ నంబర్ వన్ హీరోయిన్ అయిపోతుందేమో?!

ఒక నటికి ఇలాంటి కేరెక్టర్లు అరుదుగా దొరుకుతాయనీ, ఈ కేరెక్టర్ తాను కాక ఇంకెవరు చేస్తారంటూ ప్రశ్నించిన పాయల్ రాజ్‌పుత్ కష్టాన్ని మన ప్రేక్షకులు గుర్తించి, 'ఆర్డీఎక్స్ లవ్'కు ఘన విజయం చేకూరుస్తారా? సౌత్ ఇండియా టాప్ 10 హీరోయిన్స్‌లో ఒకదాన్నంటూ స్టేట్‌మెంట్ ఇచ్చిన ఆమెను ఇప్పుడు నంబర్ వన్ స్టార్‌ను చేస్తారా? 

"ఖాళీగా ఉన్న రోజుల్లో హీరో అవడమేంటి!": వీవీ వినాయక్‌పై బ్రహ్మానందం కామెంట్

దర్శకుడు వీవీ వినాయక్‌ను ఉద్దేశించి "ఖాళీగా ఉన్నాం, హ్యాపీగా చేసుకుందాం అనుకునే రోజుల్లో హీరో అవడమేంటండీ!" అని ఆశ్చర్యం ప్రకటించారు వెటరన్ కమెడియన్ బ్రహ్మానందం.

రామ్ చరణ్ బయటపెట్టిన నిజాలు!

'సైరా నరసింహారెడ్డి'కి రామ్ చరణ్ నిర్మాత మాత్రమే. అందులో హీరో కాదు, చిన్న పాత్రలోనూ నటించలేదు. అందుకని, 'సైరా' ప్రచార కార్యక్రమాల్లో నిర్మాతగా మాట్లాడాడు. ఆయన మాటల్లో కొన్ని నిజాలు బయటకు వచ్చాయి. సినిమా విడుదల తర్వాత ఏర్పాటు చేసిన..

ట్రెండింగ్ అయిన డేరింగ్ అండ్ డాషింగ్ స్టూడెంట్ లీడర్.. 'జార్జి రెడ్డి' ట్రైలర్ రివ్యూ

2 నిమిషాల 44 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌లో జార్జి రెడ్డి అత్యంత ధైర్యవంతుడిగా, దేనికీ తలవంచని ధీరోదాత్తుడిగా, నిమ్న వర్గాల ఆశాజ్యోతిగా, అదే సమయంలో కండబలాన్నీ ఉపయోగించే యాక్షన్ హీరోగా కనిపించాడు. యూనివర్సిటీ క్యాంపస్‌లో, హాస్టల్‌లో పెత్తనం చేసేవాళ్లపై తిరగబడి వాళ్లను చావగొట్టే వీరుడిగా మన ముందు జార్జి ప్రత్యక్షమవుతాడు. 

చిరంజీవి - కొరటాల శివ మూవీ లాంఛనంగా మొదలైంది

'సైరా.. నరసింహారెడ్డి' తర్వాత చిరంజీవి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ ఇద్ధరి కాంబినేషన్ మూవీ నిర్మాణ కార్యక్రమాలు విజయదశమి సందర్భంగా మంగళవారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

వర్మ 'రంగీలా'కు అగస్త్య మంజు అర్పిస్తున్న నీరాజనం 'బ్యూటిఫుల్'!

ఊర్మిళ, ఆమిర్ ఖాన్, జాకీ ష్రాఫ్ కాంబినేషన్‌లో తీసిన 'రంగీలా' బ్లాక్‌బస్టర్ హిట్టయి, డైరెక్టర్‌గా రాంగోపాల్ వర్మ బాలీవుడ్‌లో సుస్థిర స్థానం సంపాదించుకోవడానికి దోహదం చేసింది. ఇప్పుడు ఆ సినిమాకి నీరాజనం పలుకుతూ ఆయన శిష్యుడు అగస్త్య మంజు 'బ్యూటిఫుల్' అనే సినిమా రూపొందిస్తున్నాడు.

'సైరా'పై ప్రశంసల జల్లు!

ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా జనాల ముందుకొచ్చింది. సినిమాకి వస్తున్న స్పందన పట్ల యూనిట్ సంబరాలు చేసుకుంటోంది. మరోవైపు ప్రముఖులు సైతం ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిరంజీవి పన్నెండేళ్ల కలకు..

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here