ENGLISH | TELUGU  
Home  » Gossips

150 మూవీకి 100 క్రోర్స్ నిజమేనా?

on Jan 18, 2017


150వ సినిమా... 100కోట్లు... ఇప్పుడు ఇదే టాక్ నడుస్తోంది ఇండస్ట్రీలో!కొందరు తమ బాస్ మూవీ బాక్సులు బద్ధలు కొట్టిందంటుంటే కొందరు మాత్రం కానే కాదంటున్నారు.చిరు మూవీ సక్సెస్ అవ్వటం,పైగా పదేళ్ల గ్యాప్ తరువాత వచ్చిన సినిమా దుమ్ము రేపటం పెద్ద విశేషం కాదు.కాని,కలెక్షన్ల విషయంలో జరుగుతున్న ప్రచారమే గందరగోళానికి దారి తీస్తోంది.ఒక మెగాస్టార్ మూవీకి ఇలాంటి అయోమయ పరిస్థితి గతంలో ఎప్పుడూ రాలేదంటున్నారు క్రిటిక్స్...

ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మద్య వచ్చిన ఖైదీ నెంబర్ 150 ఊహించినట్లే సెన్సేషన్ క్రియేట్ చేసింది.కాని,సేమ్ సంక్రాంతి బరిలోనే దిగిన బాలయ్య మూవీ గౌతమీ పుత్ర శాతకర్ణిలా ఫుల్ పాజిటివ్ టాక్ సంపాదించుకోలేకపోయింది.అన్నయ్య అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ హడావుడి చేసినా విమర్శకులు మాత్రం పెద్దగా ఎగ్జైట్ కాలేదు.ఈ మిక్స్ డ్ రియాక్షన్స్ వల్ల కలెక్షన్లు ఎంత అనేది ఎటూ తేలకుండా పోతోంది.అఫీషియల్ గా ఇప్పటి వరకూ 150 మూవీ మేకర్స్ నుంచి ఎలాంటి కన్ ఫర్మేషన్ రాకపోవటంతో రచ్చ కంటిన్యూ అవుతూనే వుంది.అయితే,మెగా మూవీని ప్రొడ్యూస్ చేసింది మెగా పవర్ స్టార్ రామ్ చరణే కాబట్టి మీడియా ముందుకొచ్చి కలెక్షన్ల గొడవపై క్లారిటీ ఇస్తే బావుంటుందని కొందరంటున్నారు. చూడాలి మరి... మెగా సన్ అండ్ ప్రొడ్యూసర్ చెర్రి ఎలా స్పందిస్తాడో!


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.