ఎందుకమ్మా నీకంత హెడ్ వెయిట్?
on Feb 20, 2018
మనలో ఎంతటి ప్రతిభ ఉన్నా.. ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎదగడం కష్టం. యాటిడ్యూడ్ కారణంగానే కెరీర్ లో వెనకబడిపోయిన వారు కోకొల్లలు. తమకున్న కొద్ది టాలెంట్ ను చూసుకొని ఎక్కువగా ఫీలవ్వడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయ్.
మన నిత్యామీనన్ నే తీసుకోండి. తొలి సినిమాతోనే ‘మంచి నటి’ అని పేరు తెచ్చుకుంది. కొందరైతే ఏకంగా సౌందర్యతో కంపైర్ చేసేశారు. సౌందర్యలో లేని అదనపు క్వాలిటీ కూడా నిత్యలో ఉంది. అదే... గానం. ఇన్ని ఉండి ఏం లాభం...కేవలం ఆమె ప్రవర్తనే ఈ రోజు ఆమె వెనకబడటానికి కారణం అయ్యింది. సినిమాలు లేకపోవడంతో శరీరంపై శ్రద్ధ కూడా పెట్టలేకపోతోంది నిత్య. బాగా బరువు పెరిగిపోయి.. చూడ్డానికే ఎబ్బెట్టుగా తయారైంది. దీనికంతటికీ కారణం ఆమె హెట్ వెయిటే.
నిజానికి నిత్యామీనన్ ని మంచి మంచి అవకాశాలే వరించాయ్. సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో ముందు అనుకుంది నిత్యామీనన్నే. ఆమెను దర్శక, నిర్మాతలు కలిశారు కూడా. అయితే... ఆమె యాటిడ్యూడ్ అంతటి గొప్ప అవకాశాన్ని దక్కకుండా చేసింది. దర్శక, నిర్మాతల ముందు... ‘సావిత్రి కేరక్టర్ చేస్తే... నేనే చేయాలి.. ఎవరికుంది అంత దమ్ము’ అన్నట్టు బిహేవ్ చేసిందని విశ్వసనీయ వర్గాల భోగట్ట. అంతేకాదు... పారితోషికం విషయంలో కూడా స్థాయిని మించి అడిగిందట. దాంతో... చిర్రెత్తుకొచ్చిన దర్శకుడు నాగశ్విన్... ఆ పాత్రలో నిత్యను తప్పించి... కీర్తి సురేశ్ ని తీసుకున్నాడట. నిత్యామీనన్ యాటిడ్యూడ్... కీర్తి సురేశ్ కి వరంగా మారింది.
అంతేకాదు.. బాలయ్య నిర్మించనున్న ‘ఎన్టీయార్ బయోపిక్’ లో ఎన్టీయార్ సతీమణి ‘బసవతారకం’ పాత్రకు నిత్యామీనన్నే అనుకున్నారట బాలయ్య. ‘మా అమ్మ పాత్రకు నిత్య సరిగ్గా సరిపోతుంది. మా అమ్మ పాత్ర కాబట్టి... డైరెక్ట్ గా నేనే వెళ్లి కథ చెబుతా. తన కేరక్టర్ ని ఎక్స్ ప్లయిన్ చేస్తా. ఆ అమ్మాయి లాంటి నటి చేస్తేనే మా అమ్మ పాత్రకు న్యాయం జరుగుతుంది’ అని బాలయ్య పలువురితో అన్నారట కూడా. కానీ... ఆ అమ్మాయి... అలాంటి అపూర్వమైన అవకాశాన్ని కూడా వదులుకుంది. పైగా మీడియా వారు ‘బసవతారకం’ పాత్ర చేస్తున్నారట కదా? అనడిగితే... ‘చేయట్లేదు.. దానికి కొన్ని కారణాలున్నాయ్. చెప్పకూడదు’ అంటూ ఎదుటివారికి అనుమానాలు తెప్పించే సమాధానం ఇచ్చిందట.
నిత్యామీనన్... మంచి నటి. అంతేతప్ప..స్టార్ హీరోయిన్ కి ఉండదగ్గ ఫిజిక్ అయితే ఆమెకు లేదు. ప్రయోగాత్మక పాత్రలన్నీ చేస్తూ... ప్రేక్షకులకు చేరువ అవ్వల్సిందే తప్ప... గ్లామర్ పాత్రలు చేస్తే జనాలు ఒప్పుకోరు. ఇలా వస్తున్న మంచి పాత్రలన్నింటినీ హెడ్ వెయిట్ తో తిప్పికొడితే... కొన్నాళ్లకు ఇంటికే పరిమితం అవ్వాల్సొస్తుంది. తెలుసుకోమ్మా... నిత్యా!