అజ్ఞాతవాసిలో వెంకీని కావాలనే కట్ చేశారా..?
on Jan 10, 2018
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా కోసం.. పవర్‌స్టార్ అభిమానులతో పాటు మరో హీరో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. వారు ఎవరో కాదు విక్టరీ వెంకటేశ్ ఫ్యాన్స్. వెంకటేశ్ ఈ సినిమాలో కామియో అప్పియరెన్స్ ఇస్తాడని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఓ కామెడీ సీన్లో పవన్‌కి వెంకీ మేనమామగా కనిపించనున్నాడని కొందరంటే.. కాదు కాదు యాక్షన్ సీన్లో ఓ నాలుగు నిమిషాల పాటు దుమ్ము లేపుతాడని మరి కొందరు చెప్పారు.
తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంకీ జాడ ఎక్కడా కనిపించకపోయే సరికి ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యారు. వెంకటేశ్ అసలు ఈ మూవీలో యాక్ట్ చేయలేదేమో.. గెస్ట్ రోల్ అన్న వార్త కేవలం పుకారేనని కొంతమంది అనుకున్నారట. అయితే సినిమా రన్ టైం ఇప్పటికే 2 గంటల 40 నిమిషాలు దాటడంతో వెంకీ ఉన్న సీన్లను కట్ చేశారని.. త్వరలోనే వాటిని యాడ్ చేస్తారనే టాక్ ప్రస్తుతం ఫిలింనగర్లో వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.