చరణ్-ఎన్టీఆర్ సినిమాకి జక్కన్న ఎంత ఖర్చుపెట్టిస్తున్నాడో..?
on Nov 23, 2017
ఎస్.ఎస్ రాజమౌళి.. ఇప్పుడు ఈ పేరుకు ఉన్న బ్రాండ్ వాల్యూ అంతా ఇంతా కాదు.. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పి ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా మారిపోయాడు జక్కన్న. ఆ సినిమా తర్వాత రాజమౌళి ఏం చేయబోతున్నాడనే పుకార్లకు చెక్ పెడుతూ చరణ్-ఎన్టీఆర్‌లతో మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నట్లు చిన్న క్లూ ఇచ్చాడు. ఈ సంగతి పక్కనబెడితే చరణ్-ఎన్టీఆర్ మూవీని ఎంత బడ్జెట్‌తో తీస్తున్నారా..? అని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చించుకుంటున్నారు.
బాహుబలి కంటే ముందే తన కంటూ ఓ బ్రాండ్ ఏర్పరచుకున్న రాజమౌళి ఎంత అడిగితే అంత పెట్టడానికి నిర్మాతలు ఎప్పుడూ రెడీనే.. ఇక బాహుబలి సిరీస్‌తో వందల కోట్లు కూడా కుమ్మరించడానికి బడా ప్రొడ్యూసింగ్ హౌస్‌లు క్యూ కడుతున్నాయి. మరి ఈ సినిమా బడ్జెట్ ఎంత అంటే 150 నుంచి 200 మధ్య ఉండొచ్చు అంటున్నారు ఫిలిం క్రిటిక్స్. ఇద్దరి ఇమేజ్‌లను దృష్టిలో పెట్టుకొని.. ఇద్దరి పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తూ విజయేంద్రప్రసాద్ కథ రెడి చేస్తున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.