మెగా క్యాంప్ కు బాలీవుడ్ షాక్!
on Jul 9, 2016
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మొదలై, అప్పుడే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసుకొంది. కానీ ఇప్పటివరకూ హీరోయిన్ ఎవరనేది మాత్రం ఇంకా తెలియలేదు. తొలుత అనుష్క పేరు వినిపించినప్పటికీ.. అమ్మడు మరీ పుష్టిగా ఉండడంతో ఆమెను వద్దనుకొన్నారు. అనంతరం బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీనీ ఫైనల్ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే.. మెగా అభిమానులు మాత్రమే యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరూ "వద్దంటే వద్దు" అనడంతో ఆ ఆలోచననూ వెనక్కి తీసుకొన్నారు.
దాంతో.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ జాక్వాలిన్ ను సంప్రదించారట. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సరసన ఎంట్రీ కావడంతో అమ్మడు మహా అయితే ఓ రెండు కోట్లవరకూ అడగొచ్చని నిర్మాత రామ్ చరణ్ కూడా ఫిక్సయ్యాడు. కానీ.. జాక్వలిన్ ఏకంగా అక్షరాలా అయిదు కోట్ల రూపాయలు కోట్ చేసిందట. జాక్వాలిన్ చెప్పిన రెమ్యూనరేషన్ విని రామ్ చరణ్ కు దాదాపుగా కళ్ళు భైర్లు కమ్మాయట. సో బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఈ విధంగా మెగా క్యాంప్ కి భారీ షాక్ ఇచ్చింది!