Home

»

Gossips

పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ఆడియో రిలీజ్ లో గణేష్

Mar 22, 2011 9:01AM

ganesh babu wallpapers, ganesh babu stills, ganesh babu images, ganesh babu pics, ganesh babu photos, ganesh babu picturesఈ పవన్ కళ్యాణ్‍ "తీన్ మార్" ట్రైలర్ లో ఒక డైలాగుంది. అదేంటంటే "రోమియో జూలియట్, లైలా మజ్నూ, దేవదాస్ పార్వతి వంటి గొప్ప ప్రేమికులు కావాలంటే చచ్చిపోవాలి". ఈ డైలాగ్ ని హీరో పవన్ కళ్యాణ్ చెపుతారు. నిజమే కదా అమర ప్రేమికులెవరూ బ్రతికి తమ ప్రేమను పండించుకోలేదు. వారు చనిపోయి తమ ప్రేమను బ్రతికించుకుని అజరామరం చేశారు.

అనంతరం నిర్మాత గణేష్ చాలా ఎమోషనల్ గా ప్రసంగిస్తూ " ఒకసారి మాట పెదవి దాటిందా...ఆ మాట కోసం ప్రాణం ఇచ్చే మనిషి పవన్ కళ్యాణ్. అలాంటి గొప్ప వ్యక్తిని కన్న ఆయన తల్లిదండ్రులకు పాదాభివందనం. ఆయన తర్వాతే నా భార్య కూడా. ఆయన రుణం ఎలా తీర్చుకోను. ప్రాణం ఇచ్చా...? గొంతు కోసుకోనా...? రక్తం ఇచ్చా...? ఆయన కోసం నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. ఆయనతో మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కి పోతుంది. సిగిరెట్, మందు వంటి వ్యసనాల్లా పవన్ కళ్యాణ్ తో పరిచయం అయిన ఎవరికైనా ఆయనతో మాట్లాడటం అనేది ఒక వ్యసనంలా ఉంటుంది.

అలాంటి మంచి మనసున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన నన్ను నిర్మాతను చేశారు. రేపు మీలో ఎవరినన్నా నిర్మాతను చేయగలరు. ఇక మా సత్తిబాబు గారు. నేనున్నాన్రా అని నన్ను ముందుకు నడిపిన వ్యక్తి. ఇక మా సినిమాకి, పవన్ కళ్యాణ్ కేరీర్ లోనే అద్భుతమైన సంగీతాన్నిచ్చిన మణన్నకి నా కృతజ్ఞతలు." అని అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com