శ్రీజ భర్త హీరోనా?
on Jul 1, 2016
శిరీష్ భరద్వాజ్ తో ప్రేమ వివాహం అనంతరం అతడి నుంచి విడిపోయి.. కళ్యాణ్ అనే మరో యువకుడ్ని చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్ళాడిన విషయం తెలిసిందే. అంగరంగా వైభవంగా జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి మాత్రమే కాక బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు. మరి ఆ స్టార్ సరంజామా అంతా చూసి అలా ఫిక్సయ్యాడో లేక చిన్నప్పట్నుంచి ఆ ఆశ ఉందో తెలియదు గానీ.. చిరు చిన్నల్లుడు కళ్యాణ్ కూడా ఇప్పుడు హీరోగా వెండితెర రంగప్రవేశం చేయనున్నాడు. శ్రీజ నిర్మాణ రంగంలోకి అడుగిడుతూ రూపొందించనున్న సినిమా ద్వారా కళ్యాణ్ హీరోగా పరిచయంకానున్నాడు.
కళ్యాణ్ హీరోగా పరిచయంకానున్న సినిమాకి డైరెక్టర్ ఎవరన్నది ఇంకా తెలియకపోయినప్పటికీ.. ప్రస్తుతం తారాగణాన్ని ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలున్న మెగా కుటుంబం నుంచి మరో కథానాయకుడు వస్తుండడంతో.. ఇకపై కేవలం మెగా ఫ్యామిలీ నుంచే సంవత్సరానికి డజను సినిమాలు రావడం ఖాయమన్నమాట!