రాధికా ఆప్టే ‘అలా’ కనిపించబోతోందట!
on Oct 8, 2015
పెద్ద అందగత్తె కాకపోయినా మరాఠీ ముద్దుగుమ్మ చాలా కొద్దికాలంలోనే దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరాఠీ సినిమాల్లో మాత్రమే కాదు... హిందీ సినిమాల్లో, దక్షిణాది సినిమాల్లో కూడా వేషాలు కొట్టేస్తోంది. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా షార్ట్ ఫిలిమ్స్‌లో కూడా రాధికా ఆప్టే సంచలనం సృష్టిస్తోంది. రాధికా ఆప్టే నటించిన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ హిట్ కావడంతో ఇప్పుడు ఏ ప్రముఖ దర్శకుడు షార్ట్ ఫిలిం తీయాలని అనుకున్నా ఆయన ఫస్ట్ ఛాయిస్ రాధికా ఆప్టే అవుతోంది.
మొత్తమ్మీద చాలా తక్కువ కాలంలోనే ఈ ముద్దుగుమ్మ ఇంత పాపులర్, సక్సెస్ ఫుల్ కావడానికి కారణం అమ్మాయిగారి నటనతోపాటు ఆమె ‘బోల్డ్’నెస్ కూడా మరో ప్రధాన కారణం అని సినీ పండితులు చెబుతూ వుంటారు. అందాలను ఆరబోయడంలో ఎలాంటి మొహమాటాలూ పోకపోవడం, న్యూడ్ ఫొటోలు, వీడియోల లీకేజ్ ఈ ముద్దుగుమ్మ కెరీర్‌కి ప్లస్ అయ్యాయని అంటూ వుంటారు. ఏది ఏమైతేనేం ఇలాంటి ప్లస్ పాయిట్లన్నీ కలసి ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు ‘కబాలి’ సినిమాలో రజనీకాంత్ సరసన నటించే ఛాన్స్ వచ్చేలా చేశాయి. ‘కబాలి’ సినిమాలో రాధికా ఆప్టే ‘అలా’ కనిపించబోతోందని సమాచారం.
‘అలా’ అంటే ఎలా అనుకుంటున్నారా... అది మా నోటితో చెప్పడం ఎందుకు.. మీరే అర్థం చేసుకోండి. ఈ సినిమా ప్రపోజల్ రాధికా ఆప్టే దగ్గరకు వచ్చినప్పుడు దర్శక నిర్మాతలు ‘అలా’ నటించాలన్న కండీషన్ పెట్టారట. దానికి రాధికా ఆప్టే నవ్వేసి... దాన్దేముంది.. కథ డిమాండ్ చేస్తే తప్పదు కదా అని ఓకే చెప్పేసిందట. మొత్తమ్మీద ‘కబాలి’ సినిమాలో రాధికా ఆప్టేని ప్రేక్షకులు ‘అలా’ చూడబోతున్నారన్నమాట.