‘బాహుబలి-2’ పూర్తయిందా?
on Oct 8, 2015
‘బాహుబలి’ ది బిగినింగ్ వచ్చింది... అదరగొట్టింది... బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టింది. ఫస్టు పార్టు చూసిన ప్రేక్షకులందరూ రెండో పార్టు చూడ్డం కోసం ఎదురుచూసేలా చేసింది. ‘బాహుబలి-2’ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోందని, దానికి సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలన్నీ ఉత్తుత్తి వార్తలేనట. నిజానికి ‘బాహుబలి-2’ షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తయిపోయిందట.
‘బాహుబలి-2’ కోసం పెద్దగా షూటింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదట. రెండు పార్టులకు సరిపోయేంత షూటింగ్ ఆల్రెడీ చేసేశాకే మొదటి పార్ట్ విడుదల చేశారని సినీ పరిశోధకులు అంటున్నారు. ఒకవేళ షూటింగ్ చేయాల్సినవి చిన్న చిన్న బిట్లు తప్ప మేజర్ పార్ట్ మొత్తం పూర్తయిపోయిందని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఇంకా షూటింగ్ జరగాల్సి వుందని యూనిట్ సభ్యులు ఎందుకు చెబుతున్నారయ్యా అంటే... అదంతా బిజినెస్ వ్యూహంలో భాగమని తెలుస్తోంది.
సెకండ్ పార్ట్ కూడా చాలా కష్టపడి తీశామనే బిల్డప్పు ఇస్తేనే బిజినెస్ పరంగా ప్లస్ అయ్యే అవకాశం వుందని, ఆల్రెడీ మొత్తం ముందే తీసేశాం అంటే సినిమా కొనుక్కునేవాళ్ళు గీచి గీచి బేరం చేస్తారని ఈ వ్యూహాన్ని ఫాలో అవుతున్నారని ఫిలింనగర్ వర్గాల భోగట్టా.