కుమార్ బ్రదర్స్ పతాకంపై, సుమంత్ హీరోగా,ప్రియమణి, విమలా రామన్ హీరోయిన్లుగా, వి.యన్.ఆదిత్య దర్శకత్వంలో, కుమార్ బ్రదర్స్ నిర్మించిన చిత్రం"రాజ్".ఈ చిత్రానికి కళ్యాణిమాలిక్ సంగీతాన్నందించారు.ఈ చిత్రం ఆడియో ఇటీవల హైదరాబాద్ లోని రేడియోమిర్చి కార్యాలయంలో నిరాడంబరంగా జరిగింది.ఈ చిత్రం ఆడియోని ముందుగా హీరోయిన్ ప్రియమణి చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు.అనంతరం ఈ చిత్రం యూనిట్ ప్రసంగిస్తూ ఈ చిత్రం లోని అన్ని పాటలూ చాలా బాగా వచ్చాయనీ, అవన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందుతాయనీ అన్నారు.దర్శకుడు ఆదిత్య ప్రసంగిస్తూ ఈ చిత్రంలో సుమంత్ ఒక ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ గా నటిమచాదనీ, ప్రియమణి,సుమంత్ మధ్య కేమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందనీ, విమలా రామన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందనీ, నిర్మాతల ఖర్చుకి వెనకాడకుండా ఈ చిత్రం బాగా రావటానికి కృషి చేశారనీ అన్నారు. |