యెల్లో ఫ్లవర్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, రీచా గంగోపాథ్యాయ, దీక్షా సేథ్ హీరోయిన్లుగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో, రమేష్ పుప్పాల నిర్మించిన చిత్రం"మిరపకాయ్".ఈ చిత్రం సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదలై ఘనవిజయం సాధించింది.ఈ చిత్రం రెండువారాలకుగాను 25 కోట్ల 40 లక్షల రూపాయలు వసూలు చేసి, రవితేజ చిత్రాలన్నింటిలోకీ అత్యధికంగా వసూల చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది.ఈ చిత్రం సక్సస్ మీట్ తాజ్ దక్కన్ హోటల్లో ఇటీవల జరిగింది. ఈ విజయోత్సవానికి ఈచిత్ర నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్లతోపాటు సంగీతదర్శకుడు తమన్,సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్, ఎడిటర్ గౌతమ్ రాజు, నటులు ఆలీ, సునీల్, బ్రహ్మాజీ,దువ్వాసి మోహన్ , నటి స్నిగ్ధ హాజరయ్యారు.
ఈ సందర్భంగా హాస్యనటుడు, హీరో ఆలీ ప్రసంగిస్తూ " దాదా సాహెబ్ ఫాల్కే రూమ్ మేట్ బ్రహ్మాజీ గారికీ, రఘుపతి వెంకయ్య నాయుడు గారి రూమ్ మేట్ దువ్వాసి మోహన్ గారికీ ...అంటే నా రూమ్ మేట్ ఎవరంటారా...?యల్.వి.ప్రసాద్ గారు.ఇదంతా ఏదో సరదా కోసం అంటున్నా.
ఈ సభకు విచ్చేసిన అందరికీ నమస్కారం.ఈ సినిమా విజయానికి కారకులైన వారందరికీ నా అభినందనలు.ఈ విజయంలో నాకూ పాలున్నందుకు ఆనందంగా ఉంది.రవితేజ ఈ సినిమాలో ఇరగ్గొట్టాడు.రవితేజ తనమీద ఉంచిన నమ్మకాన్ని హరీష్ కాపాడుకున్నాడు. ఈ చిత్రాన్ని చక్కగా ప్రేక్షకులకు నచ్చేలా తీశాడు.నిర్మాత రమేష్ పుప్పాల గారు యేల్లో ఫ్లవర్స్ అని ఎందుకు పెట్టారో గానీ సూర్యుడితో పాటు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వుల్లా ఈ బ్యానర్ కూడా విజయవంతంగా సినిమాలు తీస్తుంది అనుమానం లేదు".అని అన్నారు.ఈ చిత్రం యూనిట్ సభ్యులు తమ చిత్రానికింతటి ఘనవిజయం చేకూర్చిన ప్రేక్షకులకు తమ కృతజ్ఞతలు తెలిపారు. |