"క్యూం హోగయానా" చిత్రంతో బాలివుడ్ లో నటిగా ప్రవేశించినా, తెలుగులో తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన "లక్ష్మీ కళ్యాణం" హీరోయిన్ గా ఆమె తొలి చిత్రం. కానీ దినికంటే ముందుగా తమిళంలో భారతీ రాజా దర్శకత్వంలో "బొమ్మలాట్టం" చిత్రంలో నటించినా ఆ చిత్రం 2008 లో విడుదలయ్యింది. తమిళంలో పేరరసు దర్శకత్వంలో భరత్ హీరోగా ఒక చిత్రంలోనూ, వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన కామెడీ థ్రిల్లర్ చిత్రం "సరోజ" లోనూ తమిళంలో కాజల్ నటించింది.
తర్వాత నితిన్ సరసన "ఆటాడిస్తా" చిత్రంలోనూ, సుమంత్ సరసన "పౌరుడు" చిత్రంలోనూ కాజల్ హీరోయిన్ గా నటించింది. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన "చందమామ" చిత్రం ఆమెకు లభించిన తొలి విజయవంతమైన చిత్రం. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా నటించిన "మగధీర" చిత్రం కాజల్ కు స్టార్ ఇమేజ్ నిచ్చింది. అక్కణ్ణించి ఆమె వెనుతిరిగి చూడలేదు. 2009 లో తమిళంలో "మోది విలయాడు" చిత్రంలో నటించినా అది బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ప్రస్తుతం దిల్ రాజు, దశరథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న "మిస్టర్ పర్‍ఫెక్ట్ "చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తూంది. |