English | Telugu

మహేశ్, బన్నీపై పోటీకి దిగుతున్న క‌ల్యాణ్‌రామ్

మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ మూవీ 'అల.. వైకుంఠపురములో..' 2020 సంక్రాంతికి విడుదలవుతున్నట్లు ఇప్పటికే వాటి నిర్మాతలు ప్రకటించారు. తాజాగా మరో హీరో కూడా వాళ్ళతో పోటీ పడేందుకు సై అంటున్నాడు. అతను నందమూరి క‌ల్యాణ్‌రామ్.

'గద్దలకొండ గణేష్' ఓపెనింగ్ కలెక్షన్ అదుర్స్!

'వాల్మీకి' నుంచి 'గద్దలకొండ గణేష్'గా మారిన మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించాడు. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సెప్టెంబర్ 20న రిలీజైన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో 'గద్దలకొండ గణేష్' 5.50 కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసి, ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచాడు.

ప్రభాస్... తెలుగు కంటే హిందీ ఎక్కువైందా?

ప్రభాస్ కొత్త సినిమాపై 'సాహో' ఎఫెక్ట్ పడింది. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఓ ప్రేమకథా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో పూజా హెగ్డే హీరోయిన్. ఆల్రెడీ కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. ఎప్పుడో స్క్రిప్ట్ లాక్ చేశారు. చేయడానికి....

'వాల్మీకి'పై విజయ్ దేవరకొండ సానుభూతి

వరుణ్ తేజ్ టైటిల్ రోల్ చెయ్యగా హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన 'వాల్మీకి' మూవీ టైటిల్‌ను చివరి నిమిషంలో 'గద్దలకొండ గణేష్'గా నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ మార్పు విషయమై హీరోలు, దర్శకులు ఓ వైపు మద్దతు తెలుపుతూనే, మరోవైపు సానుభూతి ప్రకటించారు.

బందోబస్త్ మూవీ రివ్యూ

నటుడిగా తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో మంచి పేరుంది. కానీ, ఈ మధ్య సరైన విజయాలే లేవు. ఈ రోజు విడుదలవుతున్న 'బందోబస్త్'తో విజయం అందుకుంటారా? 'రంగం'తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు కె.వి. ఆనంద్ ఈ సినిమాను....

'వాల్మీకి' కాదు.. 'గద్దలకొండ గణేష్'!

వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషించగా మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న 'వాల్మీకి' చిత్రానికి అనూహ్య ఆటంకం ఎదురైంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో సినిమా టైటిల్‌ను నిర్మాతలు మార్చాల్సి వచ్చింది. అవును. రేపు ఉదయం విడుదలవుతున్న....

'గౌతమ్ నందా' కాంబినేషన్ మరోసారి...

హీరో గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో ఇదివరకు 'గౌతమ్ నందా' సినిమా వచ్చింది. గౌతమ్, నందా అనే రెండు భిన్న పాత్రల్లో గోపి నటనకు ప్రశంసలు లభించాయి. వాటిలో ఒకటి నెగటివ్ కేరెక్టర్ కావడం గమనార్హం. అయితే బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ఆశించిన రీతిలో..

'వాల్మీకి'గా వరుణ్ తేజ్ ఎలా ప్రిపేరయ్యాడు? ఎలా చేశాడో తెలుసా?

ఇప్పటివరకూ వరుణ్ తేజ్ చేసిన కేరెక్టర్లనీ ఒకెత్తయితే, 'వాల్మీకి'లో చేసిన గద్దలకొండ గణేశ్ కేరెక్టర్ ఇంకో ఎత్తు. వయొలెంట్‌గా, వైల్డ్‌గా కనిపించే కేరెక్టర్‌లో మొదటిసారి మనం చూడబోతున్నాం. నటుడిగా వేరియేషన్ చూపించే కేరెక్టర్ అతడికి దొరికింది. ఇలాంటి కేరెక్టర్ చెయ్యాలని అతను ఎందుకు అనుకున్నాడు?

అబ్బో.. విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' అంట!

'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్ దేవరకొండ.. తన దృష్టినంతా క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తున్న సినిమాపై పెట్టాడు. ఇప్పటివరకూ ఈ సినిమా టైటిల్ 'బ్రేకప్' అంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. విజయ్ దేవరకొండను 'వరల్డ్ ఫేమస్ లవర్'గా క్రాంతి మాధవ్ నిర్ధారించేశాడు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో కమల్ హాసన్

నిజమే... కమల్ హాసన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన ఏ తప్పూ చేయలేదు. తప్పు చేసి జైలుకు వెళ్లలేదు. అన్యాయంగా ఆయన్ను అరెస్ట్ చేసి ఎవరో జైల్లో వేయలేదు. మరి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో కమల్ ఎందుకు ఉన్నారు? అంటే... సినిమా షూటింగ్...

'సైరా' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వాయిదా

హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో బుధవారం (సెప్టెంబర్‌ 18న) మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను లక్షలాది అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా చేయాలనుకున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లూ జరిగాయి....

'సైరా'లో ఏం ఉందని చూడాలి?

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన 'సైరా.. నరసింహారెడ్డి' కోసం కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. 'బాహుబలి 2' రికార్డుల్ని బద్దలు కొడుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ బిలీవ్ చేసిన 'సాహో'..

జీతం... జీవితం కోసం కాదు!

"మనలో చాలామంది జీవితం కోసం ప్రతిరోజూ ఉద్యోగాలకు వెళుతుంటాం. కానీ, జీతం... జీవితం కోసం కాకుండా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి, తుపాకీ తూటాలకు ఎదురు నిలిచి.. ఉద్యోగం చేసేవాళ్లే కమాండోలు" అని సూర్య అన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు...

ప్రేమికులకు సూర్య సలహా...

ప్రేమికులకు, ముఖ్యంగా అబ్బాయిలకు సూర్య ఒక సలహా ఇచ్చారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆమెను ఎలా ఒప్పించాలి? అని తీవ్రంగా ఆలోచిస్తున్న అబ్బాయిలకు ఈ సలహా బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే... నేరుగా అమ్మాయి...

'గద్దలకొండ గణేష్' బాక్సాఫీస్: 2 రోజులు.. 9 కోట్లు!

వరుణ్ తేజ్ టైటిల్ రోల్ చేయగా హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన 'గద్దలకొండ గణేష్' (వాల్మీకి) మూవీ రెండో రోజు కూడా చెప్పుకోదగ్గ రీతిలో కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.5 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రూ. 3.50 కోట్లను వసూలు చేసింది. వెరసి 'గద్దలకొండ గణేష్' రెండు రోజుల షేర్ రూ. 9 కోట్లు దాటింది.

'సైరా' విడుదలైన మూడు రోజులకే...

తెలుగులో భారీ చిత్రాల విడుదలకు వారం రోజుల ముందు, తర్వాత సరైన సినిమాలు విడుదల కావు. అది ఎవరూ రాయని రాజ్యాంగం. ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'సాహో' 30కి వాయిదా పడితే... 30న విడుదల కావాల్సిన 'నానిస్ గ్యాంగ్ లీడర్' సెప్టెంబర్ రెండోవారానికి....

కొరటాల కూడా దేవీశ్రీని పక్కన పెడుతున్నాడా?

త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, సుకుమార్... ఒకప్పుడు తెలుగులో ఈ అగ్ర దర్శకుల సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ ఆస్థాన సంగీత దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి, దేవిశ్రీకి మధ్య ఏమైందో ఏమో.... ఎస్.ఎస్. తమన్, అనిరుధ్ రవిచంద్రన్ వంటి యువ సంగీత దర్శకుల పేర్లు...

నవీన్ పోలిశెట్టి హిందీ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది!

మొదట చిన్న చిన్న పాత్రలు చేసి, సడన్‌గా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాతో హీరోగా దర్శనమిచ్చి, సూపర్ హిట్ కొట్టిన నవీన్ పోలిశెట్టి.. హిందీలో మరింత ఘన విజయం సాధించాడు. 'దంగల్' ఫేం నితేష్ తివారి డైరెక్ట్ చేసిన 'చిచ్చోరే' సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో పాటు మరో హీరోగా నవీన్ నటించిన విషయం తెలిసిందే.

ఏఎన్నార్ ఆల్వేస్ లివ్స్ ఆన్!

ఐదేళ్ల క్రితం - "నాకు కేన్సర్. నా శరీరంలో కేన్సర్ కణాలు ప్రవేశించాయని వైద్యులు చెప్పారు" అని అదేదో ఒక మామూలు జ్వరమన్నంత నింపాదిగా చెప్పిన జీవన తాత్వికుడు, ఎవర్ గ్రీన్ హీరో.. అక్కినేని నాగేశ్వరరావు. కళాకారుడికి రిటైర్మెంట్ లేదని నమ్మి, జీవన పర్యంతం...

'సైరా' సీన్లు.. 'ఒమర్ ముఖ్తార్' సీన్లు ఒక్కలాగే ఉన్నాయా?

'సైరా' ట్రైలర్‌లో నరసింహారెడ్డిని ఉరితీసే సీన్ చూస్తుంటే, చప్పున 'ఒమర్ ముఖ్తార్' క్లైమాక్స్ గుర్తుకు రావడం మన తప్పు కాదు. చూస్తుంటే ఆ మూవీ క్లైమాక్స్ స్ఫూర్తితోనే 'సైరా' క్లైమాక్స్‌ను చిత్రీకరించారేమోననే అభిప్రాయం కలుగుతుంది. నరసింహారెడ్డి "భారతమాతకీ" అనే నినాదం మినహాయిస్తే, దాదాపు రెండు క్లైమాక్స్ సీన్లూ ఒకే విధంగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి.

'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత మహేష్ బాబుతోనే!

దర్శక ధీరుడు, జక్కన్న రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా కోసం ప్రేక్షకలోకం ఎప్పటి నుండో ఎదురు చూస్తోంది. ఒకరితో మరొకరు సినిమా చేయాలని వీరిద్దరూ ఎదురు చూస్తున్నారు. మహేష్, రాజమౌళికి నిర్మాత కె.ఎల్. నారాయణ...

'సైరా'ను ఆపడం ఎవరి తరం?.. 'సైరా' ట్రైలర్ రివ్యూ

మెగా ఫ్యాన్స్.. కాదు కాదు..అందరు హీరోల ఫ్యాన్స్.. దేశంలోని ఫిల్మ్ లవర్స్ అందరూ ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తోన్న 'సైరా.. నరసింహారెడ్డి' ట్రైలర్ మన ముందుకు వచ్చేసింది. 2 నిమిషాల 53 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే.. గూస్‌బంప్స్ వచ్చాయని చెప్పడం చిన్న మాట.

'సైరా'లో కీలక కేరెక్టర్ల సంగతేమిటి?

1857లో జరిగిందని హిస్టరీలో మనం చదువుకున్న ప్రథమ స్వాతంత్ర్య సమరానికంటే ఒక దశాబ్ద కాలం ముందుగానే బ్రిటిష్ వాళ్లపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన ధీరుడిగా, వారి ఉరితీతకు గురైన సమరయోధుడిగా ఇవాళ చాలామందికి నరసింహారెడ్డి గురించి తెలుసు....

మాస్‌లో పవరేంటో 'వాల్మీకి'తో అర్థమైంది!

మాస్ సినిమా చేస్తే ఎలాంటి కిక్ వస్తుందో, మాస్‌లో ఎలాంటి పవర్ ఉంటుందో వరుణ్ తేజ్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చింది. హరీశ్ శంకర్ డైరెక్షన్‌లో చేసిన 'వాల్మీకి'.. అతనికి తొమ్మిదో సినిమా. ఇదివరకు పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'లోఫర్' అనే మాస్ సినిమా చేసినా హిట్ అందుకోలేకపోయిన అతను, ఇప్పుడు 'వాల్మీకి'ని తన ఫస్ట్ మాస్ ఫిలింగా భావిస్తున్నాడు.

బోయపాటి క్రియేటివిటీపై సెటైర్...

రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' ఫలితాన్ని పక్కనపెట్టి ముందుకు కదిలాడు. హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' చేస్తున్నాడు. నిర్మాతగా అక్టోబర్ 2న విడుదల కానున్న 'సైరా నరసింహారెడ్డి' పనుల్లో తలమునకలై ఉన్నాడు....

హై ఓల్టేజ్‌ 'యాక్షన్‌' టీజర్‌

విశాల్ హీరోగా సుందర్ సి. డైరెక్ట్ చేస్తోన్న మూవీ 'యాక్షన్'. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తయారవుతున్న ఈ చిత్రాన్ని ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఆర్‌. రవీంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఈ దీపావళికి 'యాక్షన్‌' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మాస్‌ హీరో విశాల్‌...

తమన్నా ఇంకేం చూపించగలదు?

ఓ హీరోయిన్ బికినీ వేస్తే సోషల్ మీడియాలో సెగలు పుట్టాలి. కుర్రకారుకు కిక్ ఎక్కించాలి. ప్రేక్షకుల్లో హాట్ హాట్ డిస్కషన్ జరగాలి. తమన్నా బికినీ వేస్తే ఇటువంటివేవీ జరగలేదు. ఆడియన్స్ క్యాజువల్ గా చూశారు. లైట్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ ఏడేళ్ల క్రితమే 'రెబల్'లో బికినీ...

గ్యాంగ్ లీడర్ మూవీ రివ్యూ

ఆరుగురు కలిసి హైదరాబాద్ పంజాగుట్టలోని ఒక బ్యాంకులో రూ. 300 కోట్లు దొంగతనం చేస్తారు. డబ్బు కాజేసి బ్యాంకు కింద వ్యాన్ దగ్గరకు వచ్చేసరికి ఆరుగురిలో ఒకడు మిగతా ఐదుగురినీ షూట్ చేసి, పోలీసులకు దొరక్కుండా డబ్బుతో చెక్కేస్తాడు. చంపబడిన...

పహిల్వాన్ మూవీ రివ్యూ

'ఈగ'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ హీరో సుదీప్. అంతకు ముందు 'రక్త చరిత్ర'లో చిన్న పాత్ర చేశారు గానీ... పెద్దగా ఎవరూ గుర్తించలేదు. తర్వాత 'బాహుబలి'లో చిన్న పాత్రలో కనిపించారు. త్వరలో విడుదల కానున్న 'సైరా'లోనూ నటించారు. 'కె.జి.యఫ్' ఇచ్చిన ధైర్యంతో సుదీప్ హీరోగా

Movie Reviews

Latest News

Video-GossipsGallery

'సైరా' విషయంలో రాంచరణ్ మోసం చేశారు!

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ దగ్గర నుంచి సేకరించి, 'సైరా' షూటింగ్ విషయంలో సహకరించే నిమిత్తం తమకు రూ. 50 కోట్లు ఇస్తామని మాటిచ్చి రాంచరణ్ తమను మోసం చేశారని నరసింహారెడ్డి కుటుంబీకులు ఆరోపించారు. ఈ మేరకు 'సైరా' నిర్మాత రాంచరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, మరో నలుగురిపై వారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

'వరల్డ్ ఫేమస్ లవర్' అయినా 'అర్జున్‌రెడ్డి' లుక్కేనా?

లాంగ్ హెయిర్.. ఫుల్ బియర్డ్.. నోటిలో సిగరెట్.. నిర్లక్ష్యపు సూపు. ఇదిప్పుడు విజయ్ దేవరకొండ సిగ్నేచర్ లుక్ అయిపోయిందా?.. చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. తొలిసారి ఇలాంటి లుక్‌తో అతను 'అర్జున్‌రెడ్డి' మూవీలో కనిపించాడు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్టయి, రాత్రికి రాత్రే విజయ్‌ని స్టార్‌గా మార్చేసింది.

ఇదే 'వరల్డ్ ఫేమస్ లవర్' లుక్!

క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ వచ్చేసింది. టైటిల్‌ని బట్టి అతడు సాఫ్ట్‌గా, నున్నటి గడ్డంతో ఏ రాక్‌స్టార్ తరహాలోనో కనిపిస్తాడని అందరూ ఊహిస్తుంటే అందుకు భిన్నమైన 'అర్జున్‌రెడ్డి' తరహా లుక్‌లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచాడు విజయ్.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) మూవీ రివ్యూ

'వాల్మీకి' అనే టైటిల్‌తో వరుణ్ తేజ్‌ను టైటిల్ రోల్‌లో చూపిస్తూ హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. కారణం.. వరుణ్ తేజ్ రౌడీగా నెగటివ్ కేరెక్టర్‌లో కనిపించనున్నాడనే అంశం. కానీ 'వాల్మీకి' టైటిల్‌పై బోయ సామాజిక...

అఖిల్... 'పూజ'కు వేళాయెరా!

శ్రీదేవిగా పూజా హెగ్డే వెండితెర మీదకు వచ్చేది ఈ రోజే (సెప్టెంబర్ 20). 'ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లకిల్లా పడ్డదమ్మో' అంటూ శ్రీదేవి ఐకానిక్ కల్ట్ క్లాసిక్ సాంగ్ రీమిక్స్ తో థియేటర్లలో సందడి చేసేది ఈ రోజు నుండే. అలాగే, అఖిల్ అక్కినేనితో తొలిసారి తెరను పంచుకుంటున్న సినిమా చిత్రీకరణ ప్రారంభించినది కూడా ఈ రోజే...

సైరా... మరణమే గొప్ప విజయం!

తెలుగు ప్రేక్షకులు విషాదాంత ముగింపును జీర్ణించుకోలేరని చెప్పడానికి పలు సినిమాలు ఉదాహరణలుగా నిలిచాయి. తమిళ, కన్నడ సినిమాల్లో ఉన్నట్టు తెలుగులో సాడ్ ఎండింగ్స్ తక్కువ. ఈ సెంటిమెంట్ పక్కన పెట్టిన 'సైరా నరసింహారెడ్డి' టీమ్ విషాదాంత ముంగిపు...

విక్రమ్ కుమార్ మేజిక్ ఏమైంది?

'13 బి', 'ఇష్క్', 'మనం', '24'.. ఈ సినిమాల పేర్లు చాలదూ.. ఒక డైరెక్టర్ ఎంత ప్రతిభావంతుడో చెప్పడానికి! మరి అంతటి టాలెంటెడ్ డైరెక్టర్ అయిన విక్రమ్ కుమార్‌కి ఏమైంది? అతని మ్యాజిక్ ఏమైంది?.. అనే మాటలు టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.

పూజ ఏ బిందె నడుం మీద పెట్టుకుందో అది నాకు గిఫ్ట్‌గా పంపిస్తావా?

రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన 'దేవత' సినిమాలో శోభన్‌బాబు, శ్రీదేవిపై చిత్రీకరించిన 'ఎల్లువొచ్చి గోదారమ్మా వెల్లాకిల్లా పడ్డాదమ్మో' పాట ఆ రోజుల్లో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది. ఇప్పటికీ ఆ పాట ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటుంది. వెయ్యి బిందెలతో ఆ పాటను రాఘవేంద్రరావు..

బాలకృష్ణ నెక్ట్స్ విలన్ ఎవరో తెలుసా?

'జై సింహా' హిట్ కాంబినేషన్లో నటసింహ నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో సి. కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఇందులో విలన్ ఎవరో తెలుసా? శతఫ్ ఫిగర్...

'గ్యాంగ్ లీడర్' డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అయ్యేనా?

నేచురల్ స్టార్‌గా ఫ్యాన్స్ పిలుచుకొనే నాని లేటెస్ట్ ఫిల్మ్ 'నానీస్ గ్యాంగ్ లీడర్' బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్ మంచి రిజల్ట్‌ను సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకున్నా, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా ప్రి రిలీజ్ బిజినెస్‌తో పోలిస్తే, మూడు రోజుల్లోనే 50 పర్సెంట్ పైగా రికవర్ సాధించింది.

రాజశేఖర్ పక్కన ఈసారి హీరోయిన్‌గా...

తెలుగులో నందితా శ్వేత కథానాయికగా నటించిన తొలి చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఆమెకు మంచి పేరు తెచ్చింది. ప్రామిసింగ్ హీరోయిన్ల లిస్టులో ఒకరు అవుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, ఆశించిన స్థాయిలో ఆమెకు విజయాలు దక్కలేదు...

'బందోబస్త్'తో సూర్య పప్పులుడుకుతాయా?

'బందోబస్త్'ను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారా?.. అనేది ఆసక్తికరం. ఎందుకంటే ఈ సంవత్సరం ఏ తమిళ స్టార్ మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ సాధించలేదు. అంతెందుకు.. ఆ మధ్య ఎంతో ఆర్భాటంతో, ప్రచారంతో విడుదల చేసిన సూర్య మునుపటి సినిమా ‘ఎన్‌జీకే’ తెలుగులో డిజాస్టర్ అయింది.

హీరోగా నాని నెక్స్ట్ సినిమా అదేనా?

ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా సెట్ చేసుకోవడం నానికి అలవాటు. దాంతో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయగలుగుతున్నాడు. ఎప్పుడూ నాని చుట్టూ ముగ్గురు నలుగురు దర్శకులు కథలు పట్టుకుని తిరుగుతుంటారు. ఇప్పుడూ రెండు..

అనుష్క పెయింటింగులు... ఫైటింగులు!

అనుష్క పెయింటింగ్ ఆర్టిస్ట్ అనేది 'నిశ్శబ్దం' ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తుంది. ఈ పెయింటర్ మాట్లాడలేదని ఫస్ట్ లుక్ తో పాటు ఫిల్మ్ యూనిట్ ఒక నోట్ రిలీజ్ చేసింది. సినిమాలో అనుష్క పేరు సాక్షి. ఆమె మాట్లాడలేదు. కానీ, ఆమె వేసే బొమ్మలు మాట్లాడతాయి. ఇదీ క్లుప్తంగా..

Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here