Facebook Twitter
ముక్తా బాయి రాసిన కొన్ని అభంగ్ లు

 

ముక్తా బాయి రాసిన కొన్ని అభంగ్ లు


మరాఠీ వర్కారి సంత్ లందరిలోకి మొట్ట మొదటగా ఈమె గురించి చెప్పుకోవలసింది. సంత్ గా గుర్తింపు పొంది గౌరవింపబడుతున్నవారికి కూడా వారిలోని లోపాలు ఎత్తిచూపి, జ్ఞానబోధ చేసి వారిని పరిపూర్ణత వైపు మళ్ళించిన ఘనత ముక్తాబాయిదే. ఇవన్నీ చేసిన ఈమె పద్ధెనిమిది ఏళ్ళు వయసు వరకే బ్రతికిందంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఈమె పుట్టుక, కుటుంబం, గడిపిన జీవితం మొత్తం అంతా ఎంతో అసాధారణంగా, ఒక అద్భుతంలాగే ఉంటుంది. టూకీగా ఈమె పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుందాము.

ముక్తాబాయి తల్లితండ్రులు విఠల్ గోవింద్ కుల్కర్ణి, రుక్మిని. వేదాలు ఔపోసన పట్టిన విఠల్ గోవిందు పెళ్ళి తరవాత ఆ విషయం దాచిపెట్టి వారణాసి లో సన్యాసం పుచుకుంటాడు. అయితే ఈ విషయం గురువుకి తెలిసిన తరవాత అతనికి నచ్చచెప్పి తిరిగి గృహస్తు గానే బ్రతకమని తిప్పి పంపేస్తాడు. కాని తిరిగి వచ్చిన గోవిందుని సన్యాసం పుచ్చుకున్న కారణంగానో లేక తిరిగి గృహస్త జీవితంలోకొచ్చిన కారణంగానో అర్ధం కాలేదు గాని బ్రాహ్మణ పెద్దలంతా సంఘంలోంచి వెలి వేస్తారు. వీరికి నల్గురు పిల్లలు పుడతారు. నివృత్తి, ధ్యానేశ్వర్, సోపాన్ అనే ముగ్గురు అబ్బాయిలూ చివరగా ముక్త అనే అమ్మాయి.

సంఘంలోంచి వెలివేత భరించలేని ముక్త తల్లితండ్రులు, నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటారు అప్పుడైనా పిల్లల్ని తిరిగి సమాజంలోకి ఒప్పుకుంటారేమోనన్న ఉద్దేశ్యంతో. కాని అలా జరగలేదు. దిక్కు లేని పిల్లలు అడుక్కుని జీవించే పరిస్తితి. బ్రాహ్మణ పండితులతో వీరు చేసిన వాదనలు, వీరి ఆధ్యాత్మిక జ్ఞానం, వారినెంత అబ్బురపరిచాయంటే, పిల్లలందరూ బ్రహ్మచర్యం పాటించే షరతు మీద వారి వెలివేతని రద్దు చేస్తారు. ఇదంతా చూస్తుంటే అప్పటి సమాజ నియమాలు ఎంత కఠినంగా వన్సైడెడ్ గా ఉండేవో అర్ధం అవుతుంది. . అయితే ఈ పిల్లలెంత ప్రతిభావంతులో చూడండి. నివృత్తి గొప్ప ఆధ్యాత్మిక వేత్త తన తమ్ములకి, చెల్లికీ గురువు. ధ్యానేశ్వర్ మొట్ట మొదటి వర్కారి సంత్. ఇతను అన్నగారి సలహా మేరకు 15 ఏళ్ళ వయసు లోపలే భగవత్ గీత మీద మరాఠీ లో వ్యాఖ్యానించాడు. ఆ రకంగా పండితులకి మాత్రమే అందుబాటులో ఉన్న భగవత్ గీతను సామాన్య జనానికి అందుబాటులోకి తెచ్చిన ఘనత దక్కించుకున్నాడు. అద్వైత సిద్ధాంతం మీద "అమృతానుభవ్" అనే అతి క్లిష్టమైన రచన కూడా చేసాడట. ఇదంతా కూడా టీనేజ్ లోపే. అంటే రెండు దశాబ్దాలు కూడా బతకకుండానే శతాబ్దాలు నిలిచే రచనలు చేసి సమాధిలో తనువు చాలించాడు.

తమ్ముడు లేకపోయాకా నివృత్తి చెల్లెలు ముక్తని తీసుకుని పుణ్య క్షేత్రాలు తిరగడానికి వెల్తాడు. అయితే తాపి నది వరదలో ముక్త కొట్టుకు పోతుంది. విరక్తితో నివృత్తి కూడ సమాధిలో తనువు చాలిస్తాడు. ఆఖరి తమ్ముడు సోపాన్ కూడా మరాఠీలో భగవద్ గీత మీద వ్యాఖ్యానం ఆధారంగా "సోపాందేవి" అనే రచనచేస్తాడు ఇంక కొన్ని అభంగ్ లు కూడా ఇతని పేరిట భద్ర పరచబడ్డాయి. ఈ మధ్యలో జరిగిన ముక్త జీవితాన్ని మనం తెలుసుకోవాలి.

ముక్తబాయి ఏంటో చెప్పడానికి రెండు మూడు చిన్న చిన్న సంఘటనలని చెప్పుకోవాలి. ఎనిమిదేళ్ళ వయసులో ముక్త తన అన్నలందరికి రొట్టెలు చెయ్యాలనిపించి దానికి కావాల్సిన పెనం కోసం బజారుకెళ్తుంది. అయితే వీరు వెలివేయబడ్డ కారణంగా వారికి కావల్సినవేవీ అమ్మడానికి వీలు లేదని ఊరి పెద్ద శాసిస్తాడు. ఏడ్చుకుంటూ ఇంటికొచ్చిన ముక్త నుంచి విషయం తెలుసుకున్న జ్ఞానేశ్వర్, నేలమీద చేతులు పెట్టి తన వీపుని పెనంలాగ వేడిచేసి రొట్టెలు కాల్చమంటాడుట. ఇది చూసిన ఊరిపెద్ద పిల్లల పాదాల మీద పడి క్షమాపణ అడిగి కాల్చిన రొట్టెను ప్రసాదంగా స్వీకరిస్తాడట.

ఇంకొక సంఘటనలో వీరు నల్గురు పండర్పూర్ లో సంత్ నామ దేవ్ ని కలుస్తారు. ముగ్గురు అన్నలూ ఆపాటికే పేరు పొందిన పండితులు. అయినా నామ దేవ్ పట్ల గౌరవంగా పాదాభివందనం చేసినప్పుడు వారించకుండా సంత్ నామ దేవ్ కొంచం గర్వపడటం గమనించిన ముక్త తను సాష్టాంగ పడకుండా ఒక కుమ్మరిని ఇక్కద కుండలన్నీ సరిగా కాలాయా లేదా చూడమని అడుగుతుంది. విషయం అర్ధం చేసుకున్న కుమ్మరి ఒక కర్రతో అక్కడున్న అందరి పండితుల నెత్తి మీద కొట్టినపుడూ ఎవరూ మాట్లాడరు. కాని నామ దేవ్ మాత్రం బాధతో కోపంతో గట్టిగా అరుస్తాడు. అప్పుడు కుమ్మరి అన్ని కుండలూ కాలాయి కాని ఈ కుండ సగమే కాలిందని తేలుస్తాడు. ఈ అవమానం తట్టుకోలేని నామ దేవ్ తన గురువుకి విషయం వివరించి తన తప్పు తెలుసుకుంటాడు. అలా సంత్ లలో ఉన్న అజ్ఞానాన్ని కూడా ముక్త వదిలించడానికి వెనుకాడలేదు.

ప్రజల అజ్ఞానపు మాటలతో విసిగి పోయిన జ్ఞాన దేవ్ ఒకసారి కోపంతో గుదిసె లోకి వెళ్ళి తలుపులు బిడాయించుకు కూర్చుంటాడు. అప్పుడు ముక్త ఈ పద్యం రాస్తుందట అతనిని శాంతింపచెయ్యటం కోసం.

    "An ascetic is pure in mind and forgives the offences of people. If the world is hot as fire owing to exasperation, a sage should with pleasure be cool as water. If people hurt them with weapons of words, saints should treat those remarks as pieces of advice. This universe is a single piece of cloth woven with the one thread of Brahman, so please open the door, O Jnaneshwar."


    దీనర్ధం ఒక సాధువు తన స్వఛ్చమైన మనసుతో ప్రజల తప్పులను క్షమిస్తాడు. నిట్టూర్పులలో వేసారి వేడెక్కిన ప్రపంచాన్ని ఒక సాధువు తన చెదరని ఆనందపు నీటితో చల్ల బరచాలి. ప్రజలు తమ శూలాల్లంటి మాటలతో గుచ్చినపుడు, ఒక సాధువు వాటన్న్నిటినీ సుద్దులుగా స్వీకరించాలి. ఈ విశ్వమంతా బ్రహ్మమనే దారంతో నేసిన ఒకే ఒక బట్ట. ఇది తెలుసుకుని తలుపు తియ్యి జ్ఞానేశ్వర్" అని.

ముక్తా బాయి రాసిన కొన్ని అభంగ్ లను చూద్దాము.

An ant flew to the sky and swallowed the sun.
Another wonder - a barren woman had a son.
A scorpion went to the underworld,
set its foot on the Shesh Nag's head.
A fly gave birth to a kite.
Looking on, Muktabai laughed.


ఒక చీమ ఆకాశంలోకెగిరి సూర్యుడ్ని మింగింది
ఇంకొక అద్భుతం - ఒక గొడ్రాలు కొడుకుని కన్నది
పాతాళానికి వెళ్ళిన ఒక తేలు
శేషనాగుని తలపై కాలుమోపింది
ఒక ఈగ గద్దకి జన్మ నిచ్చింది
ఇదంతా చూస్తూ ముక్తా బాయి నవ్వుకున్నది.



ఇది ఒక చిన్న పిల్ల చేసుకున్న అభూత కల్పనలు కావు. ఒక అసాధారణ తెలివితేటలు, వేదాంత జ్ఞానం, పాండిత్యం ఉండిన నేపధ్యంలో చెప్పిన మాటలు. ముక్త తన అన్నలందరితోపాటు అనాధగా, వెలివేయబడి, బిక్షమెత్తి, జనుల దయా ధర్మాల మీద బతికినది. ఆడతనం, అంటరానితనం రెండూ అనుభవించినది. ఉన్నత వర్గ సమాజం యొక్క దాష్ఠీకాలని అతి పిన్న వయసునిండి అనుభవించినది. ఒక పూర్తి జీవిత కాలపు అనుభవాన్ని తన అపారమైన జ్ఞానంతో పొందిన ముక్త మాటలు, అర్ధం చేసుకుంటే సమాజంలో బలమైన వర్గంపై, బలహీన వర్గం యొక్క విజయం ఆమె ఊహించినది అని తెలుస్తుంది.



    Though he has no form
    my eyes saw him,

    his glory is fire in my mind
    that knows

    his secret inner form
    invented by the soul.

    What is
    beyond the mind

    has no boundary.
    In it our senses end.

    Mukta says: Words cannot hold him
    yet in him all words are.



అతడికి రూపం లేదు
అయినా నా కన్నులు అతడిని చూసాయి
ఆత్మ శోధనతో కనుగొన్న
అతడి రహస్య అంతః రూపం
ఎరుకగల్గిన నా మనసున
అగ్ని వంటి తేజస్సు.
చిత్తానికావల
ఉన్న దానికి
సరిహద్దు లేదు
అదే ఇంద్రియాలు అంతమయ్యేచోట.
ముక్త చెప్తుంది:
పదాలు అతడిని పట్టలేవు,
అయినా అతడిలోనే అన్ని పదాలు ఉన్నది.


భక్తి ఉద్యమాలన్నీ ఎప్పుడూ ఎందుకు ఇంత ప్రజాదరణ పొందాయీ అంటే, నా కొకటే అనిపిస్తుంది. ఏ మతమైనా ఏ దైవం అయినా, భక్తి ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవన విధానానికి మాత్రమే పరిమితమై పోలేదు. సమాజంలో ఎప్పటికప్పుడు ఉన్న దురాచారాలను, అన్యాయాలను వ్యతిరేకిస్తూ, ఎప్పుడూ కూడా ఉన్న దాని కన్నా ఇంకొంచం మెరుగైన, న్యాయబద్ధమైన, అన్ని వర్గాల బాగోగులనూ దృష్టిలో ఉంచుకున్న సామూహక జీవన విధానం ఆశిస్తూ మొదలయినదే. ప్రజలందరి తరపున, ప్రజలందరి కోసం, ప్రజలందరినీ కలుపుకొంటూ, కేవలం ఒక వ్యక్తి చేత మొదలెట్టబడినా, ఒక మర్రి చెట్టులా వ్యాపించి వ్యవస్థీకృతం అవడంలో భక్తి ఉద్యమాలు విజయం సాధించాయి. వీర శైవం కానీ బౌద్ధం కానీ ఉదాహరణకి చూస్తే, సమ సమాజాన్నీ, మెరుగైన సామాజిక న్యాయాన్నీ అందజేయాలని తాపత్రయ పడ్డాయి కాబట్టే ప్రజల నమ్మకానికీ, ఆదరణకీ పాత్రులయ్యాయి. అవి పుట్టిన చోటే కాకుండా దేశ దేశాలకీ వ్యాపించాయి. అయితే వ్యవస్థీకృతమయ్యే క్రమంలోనే ప్రతి మతంలోనూ కొన్ని అవకతవకలు చోటు చేసుకున్నాయి. ప్రారంభంలోని ఆశయాలు మరుగున పడ్డాయి. అధికార బలానికి, ప్రజా బలానికి రాజకీయ ప్రయోజనాలకి అస్త్రాలుగా మారిపోయాయి.
మహారాష్ట్రలోని వర్కారి భక్తి ఉద్యమం మొదలుపెట్టిన ముక్తా బాయి పద్ధెనిమిది ఏళ్ళు దాటి జీవించకపోయినా, తనుకానీ తన అన్నలు కానీ సాధించిన విజయాలు, వారు చేసిన రచనలు, సమాజంపై వారి ప్రభావం, ఒక నమ్మలేని అద్భుతం కన్నా ఎంత మాత్రమూ తక్కువ కాదు. ముక్తా బాయి రాసిన ఈ భజన గీతం ఇప్పటికీ మనమెప్పుడూ వినేదే.
Om jay-jay jagdambe,jay muktai ambe l
Nij-jankalpalate tu,karunamayi ambe ll Dhru.ll
Ganga tu,go,gayatri,gita,vasundhara l
Maha-Saraswati,laxmi,kaali,maate shakti-para ll 1 ll
Nijshakti tu,adishakti,adimaya l
Brahmaswaroopini mate,tu shuddha turiya ll 2 ll
Sarvarth sadhike tu,srimante,kalyani l
Mangalroopini nijdasa,tu Dyanesh-Bhagini ll 3 ll

 

 

 

 

 

 

- శారద శివపురపు