Facebook Twitter
రాలిన ఈక

 

రాలిన ఈక



చెట్టు నుంచి
ఒక ఆకులా
ఒక పక్షి రాలిపోతున్న
దృశ్యాన్ని చూడటం ఇష్టం లేని
నా ముందు
ఆ పక్షి రెక్కల్లోంచి
ఒక ఈక
అప్పటికే
రాలిపోతోంది
నా మనసుని నొప్పిస్తూ
గాలికి వంతపాడుతూ

- యామిజాల జగదీశ్