Facebook Twitter
లవ్ స్టోరీ

   లవ్ స్టోరీ

 


                  

- జి.వి అమరేశ్వరరావు

పార్ట్ - 2

    అప్పటికీ వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది. కానీ అంధకారం మరింత దట్టమైంది.

    సాధూరం ఆస్ట్రాలజీ సెంటర్ లోంచి రోడ్డుమీదకి వచ్చి ఏదన్నా ఆటో దొరుకుతుందేమో అని చూస్తూ నడవసాగాడు.

    రోడ్డుమీద వాన నీళ్ళతోపాటు డ్రైనేజీనీళ్ళు పొంగిపొర్లుతున్నాయి,

    అతను రోడ్డు ఎక్కటం చూస్తూనే మోటాడోర్ వాన్  లోంచి దిగిన ఇద్దరు వ్యక్తులు మూవ్ అయ్యారు. సరిగ్గా వీధి మలుపు తిరిగే సమయంలో సాధూరాంకు పెద్ద ఎత్తున పెళ్ళి భజంత్రీలు చెవులకు సోకాయి. ఓ పెళ్ళి వూరేగింపు వీధిలోకి వస్తోంది.

    ముందుకు అడుగు వేయబావుయిన సాధూరాం ఆగాడు. అదే సమయంలో అతడిని నీడలా వెంటాడుతూ వచ్చిన ఇద్దర్లో బలంగా కనబడుతున్న వ్యక్తి రెయిన్ కోటు జేబులోంచి పైకి తీశాడు ఎనిమిది అంగుళాల చురకత్తి. పెళ్ళి వూరేగింపు  తాలూకు లైట్లు వెలుగు నీడల్ని స్పష్టిస్తున్నాయి.

    రెయిన్ కోటు వ్యక్తి ఒడుపుగా సాధూరాం ఎడంవైపు కిడ్నీలోకి పిడి వరకూదింపాడు చురకత్తి.

    ఎర్రటి రక్తం ఒక్కసారిగా చిమ్మికోట్టింది.

    ప్రొఫెషనల్ కిల్లర్ గా కనిపిస్తున్నా రెయిన్ కోటు వ్యక్తి చరకత్తిని సర్రున బయటకి లాగి రెండో కిడ్నీలో మరొక్కపోటు  పొడిచాక చురకత్తిని అలాగే సాధూరం బాడీలో వదిలేసి పాదరసంలా వేగంగా మూవ్ అవుతూ సేవ్ మెంట్ మీదకి ఎక్కిచీకట్లో కదులుతూ దూరంగా పార్క్ చేసివున్న సుమో వైపు మూవ్  అయ్యాడు. రెండో వ్యక్తి అతడిని ఫాలో అయ్యాడు.

    పెళ్ళి వూరేగింపును చూసి ఆగిపోయిన సాధూరాంకు తనను వెనక నుంచి తోసినట్లు అనిపించింది. అంతలోనే ఎవరో మరొకసారి నేట్టినట్టు అనుపిమ్చాగానే అతడు కోపంగా తల వెనక్కి తిప్పి చూశాడు.

    మసక చీకట్లో రెయిన్ కోట్లు ఫెల్డ్ హ్యాట్స్ ధరించిన ఏవో రెండు ఆకారాలు అతడికి కనిపించాయి. సరిగ్గా అదే సమయంలో వీపు దిగువున నుంచి ప్రారంభం అయినా నైప్పి శరవేగంగా శరీరం మొత్తం విస్తరించింది.

    సాధూరం పెద్దగా అరవబావుయాడు. అంతలోనే అతడి కళ్ళముందు చీకట్లు కమ్ముకున్నాయి, చిన్న గురకలాంటి శబ్దం అతడి నోటి నుంచి వెలువడింది.శరీరం నేలమీద కూలిపోయేలోపే అతడు ప్రాణాలు వదిలాడు, రోడ్డుమీద మోకాళ్ళ లోతులో పారుతున్న వాననీళ్ళు అతడి రక్తంతో ఎర్రబడసాగాయి.
   
                                                                  *    *    *    *   

    ఆ మర్నాడు

    సైక్రియాటిస్ట్ ఇంద్రమిత్ర ప్రయాణిస్తున్న మారుతి నక్షత్రమండల్ కాంప్లెక్స్ ఎల్లర్ పార్కింగ్ ప్లేస్ లో ఆగింది. ఇంద్రమిత్ర ఇంజన్ ఆఫ్ చేసి,డోర్స్ క్లోజ్ చేసి లిప్ట్ మీదుగా నక్షత్రమండల్కాప్లేక్స్ తొమ్మిదో అంతస్తులో వున్న డబల్ బెడ్ రూమ్ ప్లాట్ అతడు ఒక చిన్న క్లినిక్ నిర్వహిస్తున్నాడు.

    ఇంద్రమిత్ర వేగంగా నడుస్తూ తన ప్లాట్ లొకిఉ ప్రవేసించాడు. అప్పటి వరకూ అతడి కోసమే ఎదురుచూస్తున్నది. ఐరిన్. ఇంద్ర మిత్ర ఐరిస్ వైపు చిరునవ్వుతో చూశాడు.

    ఐరిస్ కు దాదాపు పదిహేడు సంవత్సరాల వయస్సు వుంటుంది. మోకాళ్ళాకురెండు అంగుళాల పైకి వున్న స్కర్ట్ లోంచి తెల్లటి తోడలు కనిపిస్తున్నాయి. కాలుమీద కలు వేసుకుని కూర్చున్నా ఐరిస్ ఇంద్రమిత్రని చూసి నిలబడి లిప స్టిక్ టీ షర్ట్ లోంచి ఆమె గుండ్రని భుజాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి, దట్టమయిన వంకీల జుట్టును వెనక్కి లాగి పావునీతయిల్ కట్టడంవల్ల ఆమె ఫాలభాగం విశాలంగా కనబడుతోంది. నీట్ గా కట్ చేసిన ఐబ్రోస్ చేత్తో గీసినట్టు ఇంద్రధనుస్సులా అర్దచంద్రాకారంలా వంపుతిరిగాయి. దట్టమైన ఐలాసిస్ ఆమె సౌందర్యాన్ని ఇనుమడింపచేశాయి. ఇంద్రమిత్రకు వచ్చే టెలిఫోన్స్ కు సమాధానం చెప్పటం, అతడి వద్దకు వచ్చే పేషెంట్స్ ను ఒక పద్దతిలో లోపలకి పంపించటం, పేషెంట్స్ కేస్ షీట్స్ మెయిన్ టెన్స్ చేయటం ఐరిస్ ముఖ్యమైన పనులు.

    ఇంద్రమిత్రను చూడగానే ఐరిస్ లేచినిలబడి చిరునవ్వుతో చెప్పింది.

    "సర్! డాక్టర్ అద్వైత్ ఫోన్ చేశారు. తన పేషెంట్ కి మీ గురించి రిఫరెన్స్ యిచ్చారట. అయన రిఫరెన్స్ చేసిన పేషెంట్ పేరు ఇంద్రకూమార్.

    ఇంద్రమిత్ర తలపకిస్తూ తన కన్ స్టటేషన్ రూమ్ లోంచి వెళ్ళిపోయాడు. అతడివైపు ఐరిస్ చిరుకోపంతో చూసింది. ఇంద్రమిత్రకు పాతిక సంవత్సరాల వయసుంటుంది. ఎక్సేర్ సైజ్ బడీ అవడంవలన కండలు తిరిగిన శరీరంలో బలంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంటాడు. ఇంద్రమిత్రకు ఎట్రాక్ట్ చేయటానికి ఐరిస్ ప్రయత్నిస్తూనే వుంది. ఎప్పుడూ బీజీగా వుండే ఇంద్రమిత్ర ఆమెను పట్టించుకోవడంలేదు.

    తన గదిలోకి వెళ్ళిన ఇంద్రమిత్ర ఆ రోజు చూడాల్సిన కసు తాలూకు ఫైల్స్ చేతిలోకి తేసుకున్నాడు. అదే సమయంలో ఇంటర్ కం గణగణ మ్రోగింది. ఇంద్రమిత్ర రిసీవర్ చెవికి అనించుకున్నాడు.అవతలి వైపు నుంచి ఐరిస్ కంఠం వినిపించింది.

    "సర్! నైన్త్ ప్లానెట్ ఆస్ట్రాలజీ సెంటర్ నుంచి ఓ మనిషి వచ్చాడు.

    "వెంటనే అతన్ని లోపలకి పంపించు."

    నైన్త్ ప్లానెట్ స్త్రాలజీ సెంటర్ పావుప్రయితర్ "కలిపురష్ పాండే" ఇంద్రమిత్రను మంచి ప్రెండ్, ఇంద్రమిత్రకు జాతకం, హస్త సాముద్రికం వంటి వాటిమీద ఏ మాత్రం నమ్మకంలేదు. వద్దని ఎంత చెప్పిన వినకుండా ఇంద్రమిత్ర డేటాప్ బర్త్, పుట్టిన సమయం మొదలైన వివరాలు తీసుకున్నాడు పాండే.ఇది జరిగి దాదాపు మూడు రోజులు అయింది. ఆస్ట్రాలజిస్ట్ గా పాండేకి  ట్వీన్ సిటీస్ లో మంచి పేరుంది.

    నైన్త్ ప్లానెట్ ఆస్ట్రాలజీ సెంటర్ నుంచి వచ్చిన వ్యక్తి ఇంద్రమిత్రకు ఓ కవర్ యిచ్చి వెళ్ళిపోయాడు. ఇంద్రమిత్ర కవర్ లోంచి ఓ కంప్యూటర్ ప్రింట్ ఔట్ బయటకి తీసి చదివాడు.

    అందులో ఇంద్రమిత్రకు చెందిన నక్షత్రగుణం, అతడు పుట్టిన ప్రదేశం తాలూకు రేఖాంశ, అక్షాంశాల వివరాలు, అతదిఉ జన్మ, లగ్నం, నక్షత్రనాడి, అతడికి కలసివచ్చే దిక్కు, రాశి, భావం, అంశ మొదలయిన వివరాలు వున్నాయి. వాటితోపాటు శుక్ర, ఇంద్ర, రాహు, శని, కేతు, కుజ రాశులు మొదలయిన విషయాలు డిటైల్డ్ గా వ్రాసివున్నాయి. రెండు నిమిషాల్లో చదవడం ముగించాక ఇంద్రమిత్రకు చిట్టా చివరి ఆకర్షించింది.