Facebook Twitter
స్నేహం - ప్రేమ -బ్నిం

స్నేహం - ప్రేమ

 

-బ్నిం

 

 

మధురాతి మధురమౌ

మన స్నేహమును తలవ

మనసుకాహ్లాదమ్ము

కలిగెడిది ఆనాడు -

 

చెలియా! నీవిప్పుడు

ప్రియురాలిగా మార

నిను తలవ మది రగిలి

కలత కలుగు -

 

నువ్వొచ్చి

గంటల్ని క్షణాలుగా దొర్లించి

వెళ్ళిపోయాక ఒక్కోక్షణం

గంట సేపు పీక్కుతింటోంది -

 

అందుకే నువ్వున్న ఆ కొంత సేపూ కూడా.....

చందమామ వెనుక చీకటి ఆకాశమంత

మళ్ళీ నువ్వెళ్ళిపోతావనే చింత -