Facebook Twitter
తను అమ్మైపోతాడు

తను అమ్మైపోతాడు

 

 

సూటిగా కళ్ళల్లోకి చూస్తున్నపుడు
పసిపాపలాంటి తన కళ్ళు నవ్వుతాయి
భుజాన్ని నాకు అరువిచ్చాక
తను నాన్నైపోయి
చెంపలు తడుతూ బుజ్జగిస్తాడు

చాలా సేపటి నిశ్శబ్ధం తరువాత
తన గొంతు ఒక అమృతమవుతుంది
ఆ పసినవ్వే మళ్ళీ నాకో పాటవుతుంది
ఏమీ తెలియనితనంలోంచి పుట్టిన ప్రేమ
అమాయకంగా,ముద్దుగా ఉంటుంది

తను ఏడుస్తాడు
నాలుగ్గోడల మధ్య కుమిలిపోయే రోదన కాదు అది
మనసు గోడలు పెకిలించుకుపోతున్నట్టుండే
బాధలో చిన్న ఓదార్పు కోసం
తను నవ్వుతాడు
ఈ పసితనం ఎప్పటికీ ఇలాగే ఉండాలన్పించేలా

నేను వేదన పడ్తున్నపుడు సమస్యంతా
తనదైపోతున్నట్టు లాలనగా తను అమ్మైపోతాడు

 

 

 

 

-సరిత భూపతి