ఎవరు నీవు - కల్లూరి శైలబాల

నా ప్రియాతి ప్రియ మిత్రమా ఏ దిగంతాలలోనో మెరిసేటి తారకా నీవెపుడు మిణుకుమిణుకుమంటూ మారుతూ వుంటావు కానీ నిశ్శబ్దంగా నిశ్చలంగా వుంటావు

Jan 11, 2012

అనంతం - ఆదెళ్ళ శివకుమార్

బ్రతుకునడక దూరం బహుదూరం విశ్వసంధ్య వెలుగులో దాని ప్రయాణం ఒక చలనం ఆద్యంత రహిత యాత్ర తీరం అనంతం

Jan 11, 2012

నాడు _ నేడు - సోమంచి ఉషారాణి

స్వాతంత్ర్య పోరాటంలో తమ రక్తం చిందించారు నాడు! స్వతపదం వ్యామోహంలో ఇతరుల రక్తం చిందిస్తున్నారు నేడు! దేశం కోసం లేశమైనా చింతించక సర్వస్వం ధారపోశారు నాడు

Jan 11, 2012

తెగిన వీణ - చిమ్మపూడి శ్రీ రామమూర్తి

అప్పుడు.. పచ్చిమట్టి వాసనలు పైరునుంచి పారేవి గాలి వేణువై హంసల మువ్వలను అందించేది ఇంటిచూరు నుంచి ఆత్మీయత, ఆప్యాయత చినుకులై రాలేవి

Jan 11, 2012

సరళకఠినం - ఆదెళ్ళ శివకుమార్

మనిషీ! ఎంత సులభం అంశాల ఆకాశాల ఎత్తులకు ఎగరటం చూడు....... ఎంత కష్టం నినుంచి నేవు ఎదగటం?

Jan 11, 2012

ప్రేమా - బి.ఎల్.ఎన్. సత్యప్రియ

అనురాగ మొలికిస్తే అణువువౌతావు ఆదమరిచేలోగ ఆకాశామవుతావు కోరుకున్న వేళల్లో కొండపైనుంటావు కాదుపోమ్మన్నపుడు కాళ్ళ దరికొస్తావు

Jan 11, 2012

నాగరీకులు - ఆధునీకులు - బి.ఎల్.ఎన్. సత్యప్రియ

కట్టినతాళే- కాలసర్పమై కాటేస్తుంటే అత్తమామలే మృత్యుదూతలై మరణశాశనం లిఖిస్తుంటే ఓర్చుకోలేక కుయుక్తులు నేర్చుకోలేక తనకు తానుగా తనువు చాలిస్తే-

Jan 11, 2012

మేఘసందేశం - సి.రామ్మోహన్

అనూష పవనాలు అలవోకగా కదులుతు వెనక్కి తిరిగి తిరిగి చూసుకుంటు వెళ్ళిపోగానే, శశికాంతుడు చిర్నగవుతో నిశికాంతను కలుసుకొన్న వేళ..........

Jan 11, 2012

క్షణక్షణం నీవుగా - దాసరి సులోచన దేవి

చెలిమి కలిమి కలయికతో వలపు వలువల వన్నెల్లో తీయని తలపుల చిరుచిరుమల్లెల సౌరభంలో రాగరంజిత పూలబాల అధారసుధారవంలో

Jan 11, 2012

కలలు అలలు - దాసరి సులోచనా దేవి

నే కనే కలలకి రెక్కలు కట్టుకుని పైపైకి ఎగురుతున్నాను అది కల అని తెలుసు కళ్ళువిప్పితే క్రింద పడిపోతాను రెక్కలు తెగిన పక్షిలా అని తెలుసు

Jan 11, 2012

కాలాగ్ని- ఎన్. హరిప్రియ

ప్రియ! బిగియార కౌగిలించిన ఈ బిగి కౌగిలి నుంచి నను వదలకు అంటే.... నీ మీద నాకు నమ్మకం లేక కాదు. ఏ కాల కెరటమో పైశాచికంగా విజృంభించి కరాళ నృత్యం చేస్తూ వచ్చి....

Jan 11, 2012

చివరిమాట - సి. రామ్మోహన్

నీకు ఎన్నో చెప్పిన నేను చెప్పకుండావెళ్తున్నా ఈ నిస్సహాయ క్షణంలో నేను కోరేది ఒక్కటే, "నేనేమైనా కానీ, నన్ను మృతి చెందని స్మృతిగామిగుల్చుకో, ఒక గాలి అల నిన్ను తాకినప్పుడు, రాలిపోయిన పువ్వు నీకంట పడినప్పుడు నీకు తెలియకుండా

Jan 11, 2012

స్పాన్సరర్స్ వస్తున్నారు జాగ్రత్త - చిల్లర భవానీదేవి

ప్రేమ ఎవర్ గ్రీన్ సబ్జక్ట్ అయినా పెళ్లి నేటి గిరాకీ వ్యాపారం స్క్రీన్ మీద ప్రసారిత స్వప్నాలనిండా ఎమోషన్లూ ....ఎక్స్ ప్రెషన్లే! పెళ్ళి తర్వత రంగుమార్చే ప్రేమకథలే!

Jan 11, 2012

స్నేహం - ప్రేమ -బ్నిం

మధురాతి మధురమౌ మన స్నేహమును తలవ మనసుకాహ్లాదమ్ము కలిగెడిది ఆనాడు - చెలియా! నీవిప్పుడు ప్రియురాలిగా మార నిను తలవ మది రగిలి కలత కలుగు -

Jan 11, 2012

సగటు ఉద్యోగిని -బి.ఎల్.ఎన్.సత్యప్రియ

ఆఫీసుల్లో- బాస్ చూపులు- బాకుల్లా దిగుతాయి- రోడ్లపై- ఈవ్ టీజింగ్ లు- ఈటెల్లా పొడుస్తాయి-

Jan 10, 2012

పిచ్చి మనసు - దాసరి సులోచనదేవి

మబ్బులు కమ్మిన ఆకాశంలో మనసు మూతి ముడుచుకుంటే కారణం ఏంటమ్మా అంటే చందమామ లాంటి చిన్నోడు కనిపించినట్టే కన్పించి అంతలోనే

Jan 10, 2012

నీవెంటే నేను- దాసరి సులోచనదేవి

తప్పక వస్తానన్నావు నువ్వు సూర్యోదయానికి ముందే సుర్యమస్తామయమయినా,పక్షులు గూటికి చేర వేళయినా నీ జాడలేదు

Jan 10, 2012

నీవే... - కమల్ తేజ్

నా నిద్దురలో నా మెళుకువలో నా ఉచ్చ్వాసలో నా నిశ్వాసలో నా బహిరంగంలో నా అంతరంగంలో నా ఆలోచనలో నా ఆరాధనలో నా అణువణువులో నా అణుక్షణంలో

Jan 10, 2012

కొత్తవ్యవస్థ - కె. వెంకటేశ్వరరావు

కుక్కలు చింపిన విస్తళ్ళలో ఎందమవుల్లాంటి ఎంగిలి మెతుకులకై చెత్తకుండిల దగ్గర బక్క చిక్కిన భావి పౌరులు!

Jan 10, 2012

కరిగిపోవాలనుంది .ప్రియా - దాసరి సులోచన

ఉదయం నుండి అలసిపోయిన సూర్యుడు చిన్నగా యింటికి దారిపడుతున్న వేళ ..యిదే అదనుగా చల్లని చిరుగాలి చొరవగా

Jan 10, 2012